Upasana: మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెల (Upasana Konidela) రేంజ్ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే తనొక స్టార్ సెలబ్రిటీగా దూసుకెళుతోంది. ఒకవైపు అపోలో మేనేజింగ్ వ్యవహారాలను చక్కబెడుతూనే, మరో వైపు మెగా ఫ్యామిలీ కోడలుగా తన బాధ్యతలను ఎంతో క్రమశిక్షణతో నెరవేరుస్తున్న ఉపాసనకు, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పిలిచి మరీ పదవిని ఇచ్చింది. అవును ఉపాసనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ స్ట్పోర్ట్స్ హబ్‌కు కో ఛైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. అలాగే అత్తమ్మాస్ కిచెన్‌ను, క్లీంకార బాధ్యతలను.. ఇలా నిత్యం బిజీగా ఉండే ఉపాసన పేరు.. ఇప్పుడు ఢిల్లీలో సైతం మారుమోగుతుంది. ఎలా, ఎందుకు అని అనుకుంటున్నారా?
సంప్రదాయ వేడుకలో భాగమైనందుకు హ్యాపీ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాంప్రదాయబద్దంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మది ప్రత్యేక స్థానం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పండుగను రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు. ఈ పండుగా స్పెషల్ ఏంటంటే.. పువ్వులు (Bathukamma Flowers), ఆకులు, గౌరమ్మ, పసుపు, కుంకుమలను మహిళలు క్రమపద్దతిలో పేర్చి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబింపజేస్తారు. తెలంగాణ మహిళలు తరతరాలుగా జరుపుకుంటున్న ఈ సంప్రదాయ వేడుకను ఢిల్లీలోని ఓ తెలుగు కాలేజీలో నిర్వహించగా, ఈ వేడుకలకు అక్కడి సీఎం రేఖా గుప్తా హాజరయ్యారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (Rekha Gupta)తో కలిసి ఉపాసన ఈ వేడుకలలో బతుకమ్మ ఆడారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ఈ సంప్రదాయ వేడుకలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ విద్యార్థులు ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకోవడం.. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలపరుస్తుందని పేర్కొన్నారు.
Thank you, @gupta_rekha Ji and the students of Ramjas College, Delhi, for embracing & celebrating Telangana culture with such love & respect.
This festive season, let’s honor the Devi within each of us & celebrate our strength together.బతుకమ్మ శుభాకాంక్షలు, नवरात्रि की… pic.twitter.com/OhFxYwQv72
— Upasana Konidela (@upasanakonidela) September 28, 2025
Also Read- Puri Jagannadh: తమిళనాడులో తొక్కిసలాట.. డైరెక్టర్ పూరి జగన్నాధ్ సంచలన నిర్ణయం
థ్యాంక్యూ రేఖా గుప్తా జీ..
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పోస్ట్‌ను ఉపాసన షేర్ చేసి.. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘రేఖా గుప్తా జీ.. మీరు అద్భుతమైన ముఖ్యమంత్రి. మా తెలంగాణ సంస్కృతిని స్వీకరించి, మాతో కలిసి బతుకమ్మ పండుగ జరుపుకున్నందుకు ధన్యవాదాలు. జై హింద్’’ అని ఉపాసన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మరో వీడియోను షేర్ చేసిన ఉపాసన.. ‘రేఖా గుప్తాజీ, ఢిల్లీలోని రాంజాస్ కళాశాల విద్యార్థులు, తెలంగాణ సంస్కృతిని ఇంత ప్రేమ, గౌరవంతో స్వీకరించి జరుపుకున్నందుకు ధన్యవాదాలు. ఈ పండుగ సీజన్‌లో, మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న దేవిని గౌరవిద్దాం, అంతా కలిసి మన బలాన్ని చాటుదాం’ అని పోస్ట్ చేశారు. ఉపాసన చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు.. చాలా గర్వంగా ఉంది మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తూ.. బతుకమ్మ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఉపాసన ఇలా ఢిల్లీ సీఎంతో కలిసి బతుకమ్మ జరుపుకోవడంతో మెగా ఫ్యాన్స్ కూడా చాలా హ్యపీగా ఫీలవుతున్నారు.
Rekha Gupta ji you are an amazing CM. Thank you for embracing our Telangana culture and celebrating Bathukamma Panduga with us. Jai Hind. 🙏❤️ https://t.co/wY7xGYp9DS
— Upasana Konidela (@upasanakonidela) September 27, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు