PuriSethupathi
ఎంటర్‌టైన్మెంట్

Puri Jagannadh: తమిళనాడులో తొక్కిసలాట.. డైరెక్టర్ పూరి జగన్నాధ్ సంచలన నిర్ణయం

Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Director Puri Jagannadh) దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ హీరోని స్టార్‌ని చేయగల సత్తా ఉన్న దర్శకుడు పూరి. అందుకే ఆయనని టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ అని పిలుస్తారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పట్లో హీరోలంతా అనుకునే వారు. కానీ ప్రస్తుతం, ఆ పరిస్థితి లేదు. కొన్నాళ్లుగా పూరి మార్క్ బాక్సాఫీస్ వద్ద పని చేయడం లేదు. ఫలితంగా వరుస ఫ్లాప్స్‌తో ఆయన సతమతం అవుతున్నారు. అందుకు కారణాలు ఏంటీ? అనేది పక్కన పెడితే.. ఎంతో నమ్మకంగా, పాన్ ఇండియా స్థాయిలో విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి చేసిన ‘లైగర్’ (Liger) చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలవడంతో.. పూరీకి ఉన్న కాస్త క్రేజ్ కూడా పోయింది. అయినా సరే, పడి లేవడం తనకు అలవాటే కాబట్టి.. మళ్లీ తన దర్శకత్వ ప్రతిభ చాటాలని పూరీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

Also Read- R Narayana Murthy: చిరంజీవి చెప్పిందంతా నిజమే.. బాలయ్య కాంట్రవర్సీపై పీపుల్ స్టార్ స్పందనిదే!

తొక్కిసలాట ఘటనే కారణం

ఇందులో భాగంగానే ఇప్పుడు తమిళ వెర్సటైన్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో టబు, సంయుక్తా మీనన్, దునియా విజయ్ వంటి నటీనటులు భాగం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇక పూరి తన పుట్టినరోజు (సెప్టెంబర్ 28)ని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్, టీజర్‌ని వదిలేందుకు సిద్ధమైనట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. కానీ, చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని ‘పూరిసేతుపతి’ (PuriSethupathi) ఫిల్మ్ మేకర్స్ వెనక్కి తీసుకున్నారు. అందుకు కారణం తమిళనాడు రాష్ట్రంలో టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనే (Tamil Nadu Stampede) అని తెలిసింది. కరూర్ పట్టణంలో జరిగిన ఈ తొక్కిసలాటలో 40 మందికి పైగా మృతి చెందారని, వందల మంది గాయపడ్డారనే విషయం తెలియంది కాదు. ఈ దుర్ఘటనను దృష్టిలో పెట్టుకుని.. ఆదివారం చెన్నైలో జరగాల్సిన ‘పూరిసేతుపతి’ చిత్ర టీజర్, టైటిల్ లాంఛ్ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

Also Read- Anasuya Bharadwaj: మరోసారి సోషల్ మీడియాలో మంటలు రేపిన రంగమ్మత్త.. ఫొటోలు వైరల్!

ఇలాంటి పరిస్థితిలో సంబరాలు తగదని..

మళ్లీ ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే దానిపై మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. విజయ్ సేతుపతి కోలీవుడ్ స్టార్ హీరో కావడంతో.. ఇలాంటి పరిస్థితిలో సంబరాలు చేసుకోవడం తగదని, ఈ కార్యక్రమాన్ని మేకర్స్ వాయిదా వేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ‘బెగ్గర్’ అనే టైటిల్ వినబడింది. కానీ, పూరి మాత్రం ఆస్కార్ రేంజ్ టైటిల్‌ని ఖరారు చేసినట్లుగా టాక్ నడుస్తుంది. అవును.. ఈ సినిమాకు ‘స్లమ్‌డాగ్’నే టైటిల్‌ను పూరి ఫిక్స్ అయ్యారని, దీనినే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్‌లో.. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. నటి చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Cyber Crimes: స్మాట్‌గా ఆకర్షిస్తారు… నీట్‌గా మోసం చేస్తారు… పెరుగుతున్న సైబర్ మోసాలు

Tollywood: టాలీవుడ్ పెద్దరికం.. బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారా?

Ind-Pak Toss Update: ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్‌.. టాస్ గెలిచిన భారత్.. జట్టులో కీలక మార్పు

Hyderabad-Vijayawada: హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం 2 గంటలే: మంత్రి కోమటి రెడ్డి

Election Commission: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ అబ్జర్వర్ల నియామకం