UP CM targetted
Top Stories, జాతీయం

National:‘బుల్డోజర్’కు బ్రేకులు

  • మోదీ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న నేత యోగి ఆధిత్యనాధ్
  • పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓటమిపై బీజేపీ విశ్లేషణ
  • యోగిపై నియంత పాలన ముద్ర
  • ముస్లిం వర్గాలను బుల్డోజర్ పనిష్మెంట్ల టార్గెట్ పెట్టిన యోగి
  • బుల్డోజర్ తో రౌడీ షీటర్లంటూ ముస్లింల ఇళ్లు నేలమట్టం
  • యూపీ ఎన్నికలలో వ్యతిరేక ప్రభావం చూపిన యోగి పాలన
  • 33 స్థానాలకే యూపీలో పరిమితమైన బీజేపీ
  • యోగిపై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ కూటమి
  • యూపీ సీఎంగా యోగిని మార్చేస్తారంటూ ప్రచారం

U P parliament elections bjp fail plan to change Yogi adityanadh:

బీజేపీకి సార్వత్రిక ఎన్నికలలో కంచుకోటలు మంచులా కరిగిపోయాయి. ముఖ్యంగా యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ లలో బీజేపీ తన మెజారిటీని కోల్పోయింది. ఇక అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ కూటమిని ఎదుర్కోలేకపోయింది. అయితే అక్కడ ప్రభావం చూపుతుందనుకున్న రామమందిరం ప్రచారం బెడిసికొట్టింది. యూపీ ఎన్నికలలో బీజేపీ బీటలు వారింది. ఇప్పుడ ఈ ప్రభావం రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలలో సైతం చూపబోతోంది. 2019లో కేవలం 62 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ప్రస్తుతం 33 స్థానాలకే పరిమితం అయింది. 2019 ఎన్నికలలో 49.6 శాతం ఓట్లు సాధించిన బీజేపీకి ఈ సారి 41.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 49 మంది బీజేపీ సిట్టింగ్ అభ్యర్థులలో దాదాపు 27 మంది ఓటమి పాలయ్యారు. ఆ ప్రభావంతోనే బీజేపీకి కేంద్రంలో సొంత మెజారిటీ దక్కించుకోలేకపోయింది. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ(అమేథీ), అజయ్‌ మిశ్రా(ఖేరి), మహేంద్రనాథ్‌ పాండే(చందౌలి), ఎనిమిదిసార్లు ఎంపీగా పనిచేసిన మేనకా గాంధీ(సుల్తాన్‌పూర్‌), మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌ కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌(ఎటా) తదితర ప్రముఖ బీజేపీ నేతలు ఓడిపోయారు.

అక్కరకు రాని అగ్రనేతల ప్రచారం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో సుమారు 200 సభలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. ప్రతి రోజూ ఐదారు లోక్ సభ స్థానాల్లో ప్రచారం చేశారు. యోగితోపాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు విస్తృత ప్రచారం చేసినా ప్రయోజనం లేకపోయింది. యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న ప్రచార సభలకు భారీగా ప్రజలు తరలి వచ్చినా ఉపయోగం లేకపోయింది. అయితే యూపీ పరాజయాలకు యోగీ ఆదిత్యనాథ్ ను బాధ్యుడిగా చేయాలని చూస్తున్నట్లు బీజేపీ శ్రేణులలో చర్చ నడుస్తున్నది. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా ప్రకటన యోగీకి చెక్ పెట్టేందుకేనని అంటున్నారు. యోగీ మీద ఒత్తిడి పెంచేందుకే ఆయన ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో కేంద్ర నాయకత్వం తప్పిదమే ఈ ఫలితాలకు కారణమని యోగీ వర్గం వాదిస్తుండగా, యూపీలో వరుసగా జరిగిన ప్రశ్నా పత్రాల లీకేజీలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల వాయిదాలు, పెరిగిపోయిన నిరుద్యోగం, వంటి అంశాలు ఎన్నికల్లో బీజేపీకి నష్టం చేశాయని అంటున్నారు. అందుకే యోగీని వీటికి బాధ్యుడిని చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని చెబుతున్నారు.

యోగి పాలనపై పెరిగిన వ్యతిరేకత

యోగి ప్రభుత్వ హయాంలో బలవంతపు నిర్బంధాలు, టార్చర్లు పెరిగిపోయాయని. శాంతి యుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు దాడులు చేస్తున్నారని, అకారణంగా అరెస్టులు చేస్తున్నారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. .లవ్ జిహాద్ పేరిట ముస్లిములను వేధిస్తున్నారని, ఇక కోవిడ్ విషయానికి వస్తే ఈ మహమ్మారికి సంబంధించి దీన్ని అప్పట్లో యోగి ప్రభ్యుత్వం సరిగా హ్యాండిల్ చేయలేకపోయిందని చెబుతున్నారు. కోవిడ్ మృతుల సంఖ్యను ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోయిందని..ఎగ్జిక్యూటివ్, పోలీసు శాఖలు సహా అన్ని పాలనా శాఖలు చతికిలబడ్డాయని, హెల్త్ కేర్ సిస్టం కుప్పకూలిందని అంటున్నారు. నేరాలు పెరిగి పోతున్నా వీటి గురించి పోలీసులు పట్టించుకోవడంలేదని.. పోలీసు శాఖ దాదాపు నిర్వీర్యమైపోయిందని ఆరోపిస్తున్నారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందని అక్కడ బాధితుల ఆరోపణ.

ముస్లిం వర్గాలను టార్గెట్ చేసిన యోగి

స్థానిక ఎన్నికల్లో సైతం హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరుగుతున్నాయని, వివిధ పార్టీల వారు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారని కేసులు పెట్టినా పరిస్థితి మారడంలేదన్నారు. కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ హత్రాస్ జిల్లాకు వెళ్తుండగా ఆయనను అరెస్టు చేశారని, ఆయన ఇప్పటికే జైల్లో ఉన్నారంటున్నారు. ఒక మహిళ అత్యాచారానికి గురైతే ఆ ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ పాత్రికేయునిపై ఇలా వ్యవహరిస్తారా అనే విమర్శలు వచ్చాయి అప్పట్లో. ఇక ముస్లింలను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా వారిపై టెర్రరిస్టు, రౌడీ షీటర్ల ముద్ర వేస్తూ వాళ్ల ఇళ్లను బుల్డోజర్ తో నేలమట్టం చేస్తూ వారిని కేసుల్లో ఇరికిస్తూ యోగి సాగించిన దమనకాండ సైతం ఈ ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపడంతో మోదీ సర్కార్ యోగిని తప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు