KCR: నేతలంతా బాగా పనిచేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) సూచించారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సహా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు, హరీశ్ రావు(Harish Rao), మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి లతో శుక్రవారం భేటీ అయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani srinivass ydava) వైద్య పరీక్షల నిమిత్తం రాకపోవడంతో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడి ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని, 6 గ్యారెంటీల్లోని ఏ ఒక్క గ్యారెంటీలోని అంశాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
గ్యారెంటీల్లో వైఫల్యాలు..
హామీలు, గ్యారెంటీల్లో వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ తప్పిదాలే మనల్ని గెలిపిస్తాయన్నారు. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. ఏమరపాటు వహించకుండా నిత్యం ప్రజల్లో ఉండాలని వారి కష్టాలను తెలుసుకొని పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు గెలిపించేందుకు కృషిచేయాలని, జూబ్లీహి(Jublihills)ల్స్ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు అందరూ ప్రచారంలో భాగస్వాములు కావాలని సూచించారు.
ప్రజాస్వామిక స్పూర్తిని అందించిన వ్యక్తి ఐలమ్మ
పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను అటు న్యాయస్థానాల్లో ఇటు క్షేత్ర స్థాయిలోనూ పోరాడి గెలవాలనే ప్రజాస్వామిక స్ఫూర్తిని చిట్యాల ఐలమ్మ తెలంగాణ సమాజానికి అందించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చిట్యాల(చాకలి)ఐలమ్మ 130 వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. నాటి రాచరిక పాలనలో, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ మీద ఐలమ్మ చేసిన పోరాటం.. తెలంగాణ మహిళా చైతన్యానికి బహుజన వర్గాల ప్రజాస్వామిక, ఆత్మగౌరవ పోరాట పటిమకు నిదర్శనం అన్నారు. ఎక్కడ రాజీ పడకుండా, సబ్బండ వర్గాల అభ్యున్నతి సంక్షేమమే ప్రధానంగా గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అమలు చేసిన విధానాలను, పథకాలను కొనసాగించడం ద్వారా మాత్రమే చాకలి ఐలమ్మకి మనమందించే ఘన నివాళి అని స్పష్టం చేశారు.
Also Read: OG Movie Ticket Hike: ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై.. తనకు తెలియకుండానే జీవో ఇచ్చారని మంత్రి ఫైర్