Bigg Boss Telugu Promo: గత సీజన్ల తరహాలోనే బిగ్ బాస్ తెలుగు 9 ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అగ్నిపరీక్షలో ఆకట్టుకున్న దివ్య నిఖిత గురువారం వైల్డ్ కార్డుగా బిగ్ బాస్ లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఎపిసోడ్ కు సంబంధించిన తొలి ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో దివ్యకు అదిరిపోయే టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇంటిలోని 13 మంది సభ్యులను వారి పర్ ఫార్మెన్స్ ఆధారంగా 1 నుంచి 13 అంకెల బోర్డు ముందు ఆమె నిలబెడుతుండటం చూడవచ్చు.
దివ్యకు స్పెషల్ టాస్క్
ప్రోమో ప్రారంభంలో బిగ్ బాస్ మాట్లాడుతూ.. ఇంటి సభ్యులను ర్యాంక్ చేయాలని దివ్యకు సూచిస్తారు. ఈ నేపథ్యంలో చివరి నుంచి (13 to 1) ఒక్కో అంకెను సభ్యులకు కేటాయిస్తూ అందుకు కారణాలను దివ్య వివరించడాన్ని ప్రోమోలో చూడవచ్చు. ముందుగా ఫ్లోరా షైనీని చివరి ర్యాంక్ (13)లో నిలబెట్టి.. మీరు తొలి రోజు నుంచి పెద్దగా యాక్టివ్ గా లేరని దివ్య చెప్పుకొచ్చింది. ఆ తర్వాత 12లో రాము, 11లో పవన్ కళ్యాణ్, 10లో శ్రీజను దివ్య నిలబెట్టింది. ఈ సందర్భంగా శ్రీజపై దివ్య ఘాటు విమర్శలు చేయడం ప్రోమోలో గమనించవచ్చు. ఆ తర్వాత 9వ ర్యాంకు బోర్డు వద్ద మాస్క్ మాన్ ను, 8వ బోర్డు వద్ద ప్రియను దివ్య నిలబెట్టి తగిన రీజన్స్ చెప్పింది.
భరణికి టాప్ ర్యాంకు
మరోవైపు 19 రోజుల పర్ ఫార్మెన్స్ ఆధారంగా చేసుకొని సీరియల్ నటుడు భరణిని.. దివ్య టాప్ ర్యాంక్ లో నిలబెట్టింది. అలాగే జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయల్ (2), సంజన (3), డిమోన్ పవన్ (4), తనూజ (5), సుమన్ శెట్టి (6), రీతూ (7)లకు తర్వాతి ర్యాంకులను కేటాయించింది.
Also Read: NATO on PM Modi: ప్రధాని మోదీపై నాటో చీఫ్ సంచలన ఆరోపణలు
ఐదుగురితో కెప్టెన్సీ టాస్క్
అంతేకాదు ఈసారి దివ్య సూచించిన ఐదుగురు ఇంటి సభ్యులు.. కెప్టెన్సీ టాస్క్ కోసం తలపడతారని బిగ్ బాస్ ప్రకటించడం తాజా ప్రోమోలో గమించవచ్చు. ‘తప్పిస్తారా? గెలిపిస్తారా?’ అన్న పేరుతో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ను సైతం నిర్వహించినట్లు ప్రోమో కనిపిస్తోంది. ఈ పోటీలో భరణి, ఇమ్మాన్యుయెల్, తనూజ, సుమన్ శెట్టి, దివ్య ఆడటం చూడవచ్చు. మిగతా కంటెస్టెంట్స్ విసిరే బాల్స్ తమ టీషర్టులకు అతుకోక్కుండా ఉండడానికి ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ ప్రయత్నించాల్సి ఉంటుంది. అతి తక్కువ బాల్స్ ఒంటిపై ఉన్న వారు ఈ వారం కెప్టెన్ కానున్నట్లు ప్రోమోను బట్టి అర్థమవుతోంది.
Also Read: Heavy Rains Alert: వర్షాలపై బిగ్ వార్నింగ్.. రాబోయే 5 రోజులు అల్లకల్లోలం.. నేడు, రేపు మరింత జాగ్రత్త