Kumbha Mela Monalisa: కుంభమేళా మోనాలీసా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క వీడియోతో ఆమె జీవితమే పూర్తిగా మారిపోయింది. కుంభమేళా సమయంలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన ఈ తేనే కళ్ళ సుందరి.. ఇప్పుడు ఎవరూ అందుకోలేని రేంజ్ కి ఎదిగింది. ప్రకృతి ఒకసారి సహకరిస్తే.. ఎలా ఉంటుందో.. మోనాలీసా జీవితమే పెద్ద ఉదాహరణ.
మహా కుంభమేళాలో వైరల్ అయిన మోనాలీసా ప్రస్తుతం, మూవీస్ లో బిజీ అయిపోయారు. అయితే, ఆమెకి డబ్బు రాగానే ప్రవర్తన మొత్తం మారిపోయింది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమం వద్ద రుద్రాక్ష మాలలు అమ్ముతున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని వలన ఆమెకు లక్షలాది వీక్షణలు, ఫాలోవర్లు వచ్చారు.
అయితే, ఈ ఆకస్మిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆమెకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది. ఆమె వద్ద సెల్ఫీలు, వీడియోల కోసం జనం గుమిగూడడంతో, ఆమె మాలల అమ్మకాలు పూర్తిగా తగ్గాయి. దీనివల్ల ఆమె జీవనోపాధి దెబ్బతింది. ఇంకా, ఆమె భద్రతకు సంబంధించిన ఆందోళనల కారణంగా, ఆమె తండ్రి ఆమెను ఇండోర్‌కు తిరిగి పంపించాడు. డబ్బు, కొంచం ఫేమ్ రాగానే మారిపోయిందంటూ ఏఐ ద్వారా
డీప్ ఫేక్ వీడియో క్రియోట్ చేశారు. అయితే, చాలా మంది ఇది నిజమే అని నమ్ముతున్నారు. వాటిలో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేస్తుస్తున్నారు.