Puri Jagannadh: హీరోలకు అభిమానులు ఉండటం సహజమే.. అలాంటి అభిమానులు దర్శకులుగా మారితే. ఇప్పుడు అదే జరిగింది. దర్శకుడు కాకమందు నుంచీ పూరీ జగన్నాధ చిరంజీవికి వీరాభిమానిగా ఉండేవాడు. ఆ రోజల్లో అభిమాన హీరోల కోసం అభిమానులు రకరకాలుగా తమ అభిమానాన్ని వ్యక్తం చేసేవారు. పూరీ జగన్నాధ్ వ్యవహారంలో అదే జరిగింది. పూరీ జగన్నాధ్ పాత వస్తువులు తిరగేస్తుండగా ఆయనకు ఒక డైరీ దొరికింది. అది పూరీ జగన్నాధ్ రాసుకున్నదే. అందులో ఖైదీ సినిమా విడుదల రోజున తన స్వహస్తాలతో చిరంజీవి బొమ్మ గీసి థియేటర్ దగ్గర ప్రదర్శనకు ఉంచారట. అయితే దీనికి సంబంధించిన ఫోటో తన పాత డైరీలో దొరకడంతో ఆయన ఎంతో భావోద్వేగానికి గురై దానికి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి అభిమానులు నుంచి మంచి స్పందన వస్తుంది. చిరంజీవి పూరీ జగన్నాధ్ కాంబోలో సినిమా రావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. ఆటో జానీ గురించి అప్టేడ్ ఉంటే చెప్పండి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Read also-Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!
పూరీ జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాతగా పేరొందాడు. 1966లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపిరాజు కొత్తపల్లిలో జన్మించిన అతను, రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, 2000లో బద్రితో దర్శకుడిగా మారాడు. పోకిరి (2006) వంటి బ్లాక్‌బస్టర్‌లతో అతను ‘స్టార్ మేకర్’గా గుర్తింపు పొందాడు, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రవితేజలను సూపర్‌స్టార్లుగా మార్చాడు. అతని సినిమాలు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్, పవర్ ఫుల్ డైలాగులు, స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మూడు నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు (పోకిరి కోసం) అతని సామర్థ్యాన్ని చాటాయి. గత కొంత కాలంగా హిట్లు లేక కమర్షియల్ సినిమాల నుంచి ఈ సారి ఫ్యామిటీ డ్రమాల వైపు కథలనుమళ్లించారని తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా రాబోయే సినిమా విజయ్ సేతుపతితో తీస్తున్నారు. ఇటీవల అదే సెట్ లో మెగాస్టార్ కూడా పూరీ ని కలిసి సందడి చేశారు.
పూరీ జగన్నాథ్ పూరీ కనెక్ట్స్, వైష్ణో అకాడమీ వంటి ప్రొడక్షన్ హౌస్‌లను నడుపుతూ, పూరీ మ్యూసింగ్స్ పాడ్‌కాస్ట్ ద్వారా సినిమా చర్చలు నిర్వహిస్తున్నాడు. 2025లో విజయ్ సేతుపతితో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై పనిచేస్తూ, రాజా సాబ్ సెట్స్‌లో ప్రభాస్‌తో కలిసి కనిపించాడు. అతని శైలి, హీరోలను 360 డిగ్రీల మార్పుతో చూపించే నైపుణ్యం, వేగవంతమైన షూటింగ్ స్పీడ్ అతన్ని ‘సూపర్ ఫాస్ట్ డైరెక్టర్’గా నిలబెట్టాయి. తెలుగు సినిమాలో అతని ప్రభావం శాశ్వతంగా గుర్తుండిపోతుంది. తాజాగా ఆయన చేసిన ఫోస్ట్ మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్ని కటిగిస్తుంది.
పాత డైరీ దొరికింది. ఖైదీ సినిమా రిలీజ్ రోజున, ఒక అభిమాని తన స్వహస్తాలతో చిరంజీవి గారి చిత్రం గీసి థియేటర్ దగ్గర photo card display లో పెట్టిన 60/40 ఫోటో దొరికింది. ఆ అభిమాని పేరు
పూరి జగన్నాథ్. pic.twitter.com/ZHiEysD9BF— Puri Connects (@PuriConnects) September 25, 2025