BC Reservations (imagecredit:twitter)
తెలంగాణ

BC Reservations: బీసీ రిజర్వేషన్లు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు.. కొట్టి పారేసిన ధర్మాసనం

BC Reservations: బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రక్రియ రాజ్యాంగ వ్యతిరేకమంటూ పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించ రాదని సుప్రీం కోర్టు, రాజ్యాంగం స్పష్టం చేస్తున్నాయన్నారు. అయితే, ప్రభుత్వం తలపెట్టిన రిజర్వేషన్లను అమలు చేస్తే అవి 68శాతానికి చేరుతాయని పేర్కొన్నారు. పాత రిజర్వేషన్ల ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) జరిపేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వీటిపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు రెండి పిటిషన్లను కొట్టి వేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ప్రజా ప్రయోజనాల పిటిషన్లు దాఖలు

రిజర్వేషన్లను కల్పించి ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవాపూర్ కు చెందిన సామాజిక కార్యకర్త మాధవరెడ్డి, సిద్దిపేటకు చెందిన మరో వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు 28శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 9శాతం రిజర్వేషన్లు ఉన్నట్టు తెలిపారు. బీసీలకు 42 శాతం అమలు చేస్తే రిజర్వేషన్ల శాతం 68కి పెరుగుతుందని తెలిపారు. దీని వల్ల స్థానిక ఎన్నికల నిర్వహణ కూడా సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 2018 తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం సెక్షన్​ 285(ఏ) ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Also Read: MD Ashok Reddy: తవ్విన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని జలమండలి ఎండీ ఆదేశం

తమిళనాడు వ్యవహారం..

అయితే, ఈ సెక్షన్ ను తొలగించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని, దీనికి ఇకా గవర్నర్, రాష్ట్రపతి ఆమోదాలు లభించ లేదని తెలియచేశారు. తమిళనాడులో 69 రిజర్వేషన్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా 68శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. అయితే, తమిళనాడు వ్యవహారం సుప్రీం కోర్టులో ఉందని పేర్కొన్నారు. బీహార్(Bihar) లో రిజర్వేషన్లను పెంచాలన్న ప్రయత్నాలు న్యాయస్థానాల్లో వీగి పోయినట్టు తెలిపారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిపేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయితీ రాజ్ శాఖ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు, ఎన్నికల సంఘంన మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు.

కొట్టేసిన హైకోర్టు..

ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు రెండింటినీ కొట్టివేసింది. ఈ క్రమంలో పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.

Also Read: Nodha Hospital: నోద హాస్పిటల్‌లో మళ్లీ ఆపరేషన్ వికటించిందా?..పేషెంట్ల ప్రాణాలు సైతం లెక్కలో లేనట్టేనా?

Just In

01

OG Movie: ఎక్స్ లో ట్రెండ్ అవుతున్న డిజాస్టర్ ఓజీ.. ఆ ఫ్లాప్ మూవీతో పోలుస్తున్న ట్రోలర్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్లకు ఈ వారంలోనే రూ.188 కోట్లు రిలీజ్!

Foreign Cars Smuggling Case: లగ్జరీ కార్ల స్మగ్లింగ్.. తెరపైకి కేటీఆర్ పేరు.. లిస్టులో అందరూ ప్రముఖులే!

Medaram Jatara: మేడారం కీర్తి ప్రపంచానికి తెలిసేలా చేయాలి.. అధికారులకు మంత్రి ఆదేశం

Warangal District: ఈఎస్టీఐసి-2025 ప్రతిష్టాత్మక సదస్సుకు.. వరంగల్ వాసి ఎంపిక!