OG release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ‘ఓజీ’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు స్పెషల్ పెయిడ్ ప్రీమియర్లు కూడా పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్పెషల్ ప్రీమియర్లు, డే వన్‌కు సంబంధించిన టికెట్లు అన్నీ కూడా అమ్ముడుపోయాయి. ఈ లెక్కన ఓజీ మొదటి రోజు రికార్డుల్ని క్రియేట్ చేయడం ఫిక్స్ అని అర్థం అవుతోంది. పవన్ కళ్యాణ్‌కు వీర అభిమాని అయిన రాజేష్ కల్లెపల్లి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ‘ఓజీ’ని రిలీజ్ చేసేందుకు దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ తో చేతులు కలిపారు. దీంతో ఈ సినిమా మరింత జనాల్లోకి వెళ్లడానికి ఉపయేగపడుతోంది.
Read also-Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తెలుగు అగ్రనేతలు హతం
అమెరికాలోని డల్లాస్‌లో ఉండే ప్రముఖ వ్యాపారవేత్త, కమ్యూనిటీ లీడర్, దాత అయిన రాజేష్ కల్లెపల్లి టెక్సాస్‌లోని గార్లాండ్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. అది విదేశాలలో తెలుగు సినిమాకు ఒక మైలురాయి వేడుకగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘రాజు యాదవ్’ చిత్రానికి సహ నిర్మాతగా నిర్మాణంలో కూడా రాజేష్ తనదైన ముద్ర వేశారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ‘రాజు యాదవ్’కు మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. రాజేష్ కల్లెపల్లి స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు.
Read also-Digital Arrest: పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉందంటూ వృద్ధుడి డిజిటల్ అరెస్ట్
రాజేష్ కల్లెపల్లి తన దృష్టి, నాయకత్వం, సినిమా పట్ల మక్కువను కలిపి ఉత్తరాంధ్రలో ‘ఓజీ’ గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 24, రాత్రి 10 గంటలకు ప్రపంచవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 25, 2025న ‘ఓజీ’ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతోన్నారు. ‘ఓజీ’ సినిమా వెనుక ఉన్న క్రూ ఒక స్టార్ టీమ్ చిత్రాన్ని భారీ విజువల్ ఫీస్ట్‌గా మార్చింది. డైరెక్టర్ సుజీత్, ‘సాహో’ ఫేమ్‌తో, స్టైలిష్ యాక్షన్, గ్రిప్పింగ్ నరేషన్‌తో మ్యాజిక్ చేశాడు. ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తీసిన అనుభవంతో, రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ చేత అద్భుతమైన విజువల్స్‌తో, ఎడిటింగ్ నవీన్ నూలి చేత క్రిస్ప్‌గా రూపుదిద్ధుకుంది. థమన్ ఎస్ మ్యూజిక్ మాస్ బీట్స్‌తో స్క్రీన్‌ను షేక్ చేసేలా కంపోజ్ చేశారు. స్క్రిప్ట్ రైటర్స్ సైనాధ్ అల్లా, సుజీత్ కలిసి, ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు బలమైన కథనాన్ని అందించారు. ఈ టీమ్‌వర్క్ ‘ఓజీ’ని ఒక ఐకానిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది.
Get ready for the FIRESTORM and it’s coming on Sept 25th 💥#OG #TheyCallHimOG @PawanKalyan @emraanhashmi @SujeethSign @Iam_Arjundas @priyankaamohan @MusicThaman @Dop007 @manojdft @Navinnooli #AsPrakash @IamKalyanDasari @venupro @DVVMovies @SonyMusicSouth pic.twitter.com/nWFSsaU07y
— Sri Venkateswara Creations (@SVC_official) September 23, 2025