OG movie: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా నుంచి మరో రెండు కీలక పాత్రలను రివీల్ చేశారు నిర్మాతలు. తాజాగా దీనికి సంబంధించిన రెండు పోస్టర్లను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో ఒకరు హీరో డైరెక్టర్ నవీన్ చంద్ర, భద్రగా కనిపిస్తున్నారు. మరోపేరు ధీనాద్. ఈ రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్ లు విడుదలయ్యాయి. వారిని అలా చూసిన ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా పై భారీ హైప్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాన్సర్ట్ భారీ వర్షం వల్ల హడావిడిగా ముగియడంతో ప్రేస్ మీట్ పెట్టాలని నిర్మాతలు యోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా థయేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ.300 కోట్లకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా టికెట్లను అభిమానులు లక్షలు పెట్టి కొంటున్నారు. అలా వచ్చిన డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నారు.
Read also-Mallu Bhatti Vikramarka:ఈ సాగు చేసే రైతులకు గుడ్ న్యూస్.. 3,745 కోట్ల పెట్టుబడులు1,518 మందికి ఉపాధి
సినిమా కోర్ స్టోరీ, ఒక గ్యాంగ్‌స్టర్ రిటర్న్ చుట్టూ తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్లే చేసే ‘ఓజస్ గంభీర’ (Ojas Gambheera) అనే క్యారెక్టర్, 10 సంవత్సరాల పర్యవసానం తర్వాత ముంబైకి తిరిగి వస్తాడు. ఆయన ముందు గ్యాంగ్ లైఫ్‌లో ఒక పాత శత్రువుతో (ఎమ్రాన్ హాష్మీ ప్లే చేసే ‘ఓమి భావు’ – Omi Bhau) సెటిల్ చేసుకోవాలని మనసులో పెట్టుకుని, రివెంజ్ మిషన్‌లో ఎంబార్క్ అవుతాడు. ఇది కేవలం యాక్షన్ కాదు – ఇది భావోద్వేగాలతో కూడిన డార్క్ డ్రామా. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, బాడీ లాంగ్వేజ్, అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఇంటెన్సిటీ – ఇవన్నీ స్క్రీన్ మీద అభిమానులకు కావాల్సి నట్టుగా ఉంటాయి.
Read also-Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తెలుగు అగ్రనేతలు హతం
‘ఓజీ’ సినిమా వెనుక ఉన్న క్రూ ఒక స్టార్ టీమ్ చిత్రాన్ని భారీ విజువల్ ఫీస్ట్‌గా మార్చింది. డైరెక్టర్ సుజీత్, ‘సాహో’ ఫేమ్‌తో, స్టైలిష్ యాక్షన్, గ్రిప్పింగ్ నరేషన్‌తో మ్యాజిక్ చేశాడు. ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తీసిన అనుభవంతో, రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ చేత అద్భుతమైన విజువల్స్‌తో, ఎడిటింగ్ నవీన్ నూలి చేత క్రిస్ప్‌గా రూపుదిద్ధుకుంది. థమన్ ఎస్ మ్యూజిక్ మాస్ బీట్స్‌తో స్క్రీన్‌ను షేక్ చేసేలా కంపోజ్ చేశారు. స్క్రిప్ట్ రైటర్స్ సైనాధ్ అల్లా, సుజీత్ కలిసి, ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు బలమైన కథనాన్ని అందించారు. ఈ టీమ్‌వర్క్ ‘ఓజీ’ని ఒక ఐకానిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది.
The canvas of #TheyCallHimOG is set to stun you all 🔥
Introducing Bhadra & Dheenanath.#OG pic.twitter.com/V5yEhZAWth
— DVV Entertainment (@DVVMovies) September 23, 2025