Splitsville review: స్ప్లిట్స్‌విల్ 2025లో మైఖేల్ యాంజెలో కోవినో డైరెక్ట్ చేసిన కామెడీ సినిమా. డాకోటా జాన్సన్, అడ్రియా అర్జోనా, కైల్ మార్విన్, మరియు కోవినో లాంటి స్టార్ కాస్ట్‌తో వచ్చింది. సినిమా ప్లాట్ చాలా సింపుల్‌గా స్టార్ట్ అవుతుంది అష్లీ (అడ్రియా అర్జోనా) డివోర్స్ అడిగిన తర్వాత, మంచిహృదయుడైన కేరీ (కైల్ మార్విన్) తన ఫ్రెండ్స్ జూలీ (డాకోటా జాన్సన్), పాల్ (మైఖేల్ యాంజెలో కోవినో) వద్దకు వెళతాడు. అక్కడ షాక్ – వాళ్ల సీక్రెట్ హ్యాపీనెస్? ఓపెన్ మ్యారేజ్! కానీ కేరీ లైన్ క్రాస్ చేస్తే… బాంగ్! అందరి రిలేషన్‌షిప్స్ గందరగోళానికి గురవుతాయి. ఇది కేవలం లవ్ ట్రయాంగిల్ కాదు, ఫుల్ ఫోర్‌సమ్ కామెడీ – సెక్స్, జెలసీ, మిక్స్ అయిన ఒక మెసీ రైడ్ గా వర్ణంచవచ్చు. దీనిని చూడాలంటే ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులో ఉంది.
కథ
కార్ లో ఒక సెక్సువల్ ఎన్‌కౌంటర్ డిజాస్టర్‌గా మారి, మరణం, సెక్స్, లైఫ్ థీమ్స్‌ను టచ్ చేస్తుంది. మొదటి రెండు యాక్ట్స్ చాలా ఎంగేజింగ్: ఓపెన్ మ్యారేజ్ డైనమిక్స్‌ను ఫన్నీగా ఎక్స్‌ప్లోర్ చేస్తూ, కేరీ ఎలా లైన్ క్రాస్ చేస్తాడో క్లైమాక్స్ బిల్డప్ అదిరిపోతుంది. ఒక సీన్‌లో, హౌస్ ఫైట్ సీన్ – లూనీ ట్యూన్స్ లాంటి కార్టూనిష్ హైటెన్షన్, ఎవరూ మరిచిపోలేని విధంగా ఉంటుంది. కానీ థర్డ్ యాక్ట్‌లో కొంచెం డ్రాగ్ అవుతుంది – క్యారెక్టర్స్ ఓవర్‌స్టఫ్ఫ్ అయ్యి, ప్రెడిక్టబుల్ ఎండింగ్‌తో స్పీడ్ లూస్ చేస్తుంది. అయినా, ఓవరాల్ పెయ్సింగ్ గుడ్, 1 గంట 40 నిమిషాలు ఫన్‌గా టైమ్ పాస్ అవుతాయి.
Read also-71st National Awards: జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు గ్రహీతల ఫస్ట్ రియాక్షన్.. ఏంటంటే?
టెక్నికల్ అస్పెక్ట్స్
విజువల్స్ అండ్ హ్యూమర్ స్టైల్సినిమాటోగ్రఫీ (ఆడమ్ న్యూపోర్ట్-బెర్రా) స్పెరికల్ 35mm లుక్‌తో ఓల్డ్-స్కూల్ ఫీల్ ఇస్తుంది – కామెడీలు TV సిట్‌కామ్ లాగా కాకుండా, సినిమాటిక్‌గా కనిపిస్తాయి. కేమెరా వర్క్ హ్యూమర్‌కు హెల్ప్ చేస్తుంది, మోంటాజ్ సీన్స్ (ఎక్స్-లవర్స్ మూవీ నైట్!) సూపర్ క్రియేటివ్. హ్యూమర్?– మగ ఇగోలు, జెలసీపై టార్గెట్ చేసి, ఎథికల్ నాన్-మానగమీని రాకస్‌గా షో చేస్తుంది. కానీ మహిళల సైడ్‌కు ఎక్కువ అటెన్షన్ లేకపోవడం కొంచెం మైనస్.
రేటింగ్: 3.5/5