national-film-awards( image :X)
ఎంటర్‌టైన్మెంట్

71st National Awards: జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు గ్రహీతల ఫస్ట్ రియాక్షన్.. ఏంటంటే?

71st National Awards: తీయ అవార్డులు అందుకున్న తెలుగు గ్రహీతల ఫస్ట్ రియాక్షన్.. ఏంటంటే? నిమా వరికి ఇచ్చే దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఫిల్మ్ ఫేర్. ఇంతటి ప్రతిష్టాత్మక మైన అవార్డును తెలుగు వారికి కూడా రావడం ఎంతో గర్వకారణం. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2025 ఆగస్టు 1న ప్రకటించబడ్డాయి. తెలుగు సినిమా ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన పురస్కారాన్ని సాధించింది, ముఖ్యంగా సాంకేతికత, భక్తి రంగంలో తన సత్తాను చాటింది. ఈ పురస్కారాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025 సెప్టెంబర్ 23న న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, నటులు తదితరులు సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని పంచుకున్నారు.

ఉత్తమ చిత్రం – భగవంత్ కేసరి
‘భగవంత్ కేసరి’ నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ డ్రామా చిత్రం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ ఒక బలమైన, భావోద్వేగ పాత్రలో కనిపిస్తారు. తన కుమార్తె రక్షణ కోసం పోరాడుతూ ఆయన ఏం చేశారన్నది కథాంశం. కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించారు. కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఉత్తమ నేపథ్య సంగీతం: యానిమల్ (హర్షవర్ధన్ రామేశ్వర్)
2023లో విడుదలైన హిందీ చిత్రం ‘యానిమల్’ కి హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్ నటించిన ఈ చిత్రంలో హర్షవర్ధన్ స్కోర్ యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలను ఎలివేట్ చేసేలా ఉంటుంది. ‘పాపా మేరీ జాన్’ పాట ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకుంది.

బెస్ట్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్: హనుమాన్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన తెలుగు సూపర్‌ హీరో చిత్రం ‘హనుమాన్’. వెంకట్ కుమార్ జెట్టి వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గా, ఫ్లిక్స్‌విల్లే, విసికేఫీ స్టూడియోలతో కలిసి అద్భుత విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. అంజనాద్రి గ్రామ నేపథ్యంలో, హనుమంతు పాత్ర హనుమాన్ శక్తులతో మెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో రియలిస్టిక్ హనుమాన్, 3D షాట్స్ చిత్రానికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టాయి.

బెస్ట్ యాక్షన్ డైరెక్షన్: హనుమాన్
‘హనుమాన్’ చిత్రంలో యాక్షన్ డైరెక్షన్ అద్భుతంగా రూపొందించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన ఈ సూపర్‌హీరో చిత్రంలో, యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అనబరన్, సుప్రీమ్ సుందర్, కల్యాణ్ దాసరి హనుమంతు పాత్ర యాక్షన్ సన్నివేశాలను ఎలివేటెడ్ గా తీర్చిదిద్దారు. క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు, హనుమాన్ శక్తులతో ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఉత్తమ నేపథ్య గాయకుడు: బేబీ (ప్రేమిస్తున్నా – పీవీఎన్ఎస్ రోహిత్)
2023లో విడుదలైన బేబీ చిత్రంలోని “ప్రేమిస్తున్నా” పాటకు పీవీఎన్ఎస్ రోహిత్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా 71వ జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్నారు. సాయి రాజేష్ దర్శకత్వంలో, విజయ్ బుల్గానిన్ స్వరకల్పనలో, సురేష్ బానిసెట్టి రాసిన ఈ ఎమోషనల్ పాట రోహిత్ గాత్ర మాయాజాలంతో ప్రేమ లోతును ఆవిష్కరించింది.

ఉత్తమ గేయ రచయిత: కాసర్ల శ్యామ్ (బలగం – ఊరు పల్లెటూరు)
2023లో విడుదలైన బలగం చిత్రంలోని “ఊరు పల్లెటూరు” పాటకు కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా 71వ జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో, భీమ్స్ సిసిరోలియో స్వరకల్పనలో, ఈ పాట తెలంగాణ గ్రామీణ జీవన భావోద్వేగాలను, సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించింది.

ఉత్తమ బాలనటి: గాంధీ తాత చెట్టు (సుకృతి వేణి)
‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో సుకృతి వేణి అద్భుత నటనకు 71వ జాతీయ చలనచిత్ర అవార్డు (ఉత్తమ బాలనటి) గెలుచుకుంది. పద్మావతి మల్లాది దర్శకత్వంలో, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో ఈ సినిమా వచ్చింది. గాంధీ సిద్ధాంతాలు నమ్మే మనవరాలి పాత్రలో సుకృతి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాసాహెబ్ ఫాల్కే, దుబాయ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లలోనూ ఆమె అవార్డులు అందుకుంది.

బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): బేబీ (తెలుగు – సాయి రాజేశ్ నీలం)
2023లో విడుదలైన బేబీ చిత్రానికి సాయి రాజేశ్ నీలం ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లేకి గాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం ఇది. ఆధునిక సంబంధాలను, యువత ఎమోషన్స్‌ని చిత్రీకరిస్తుంది. సాయి రాజేశ్ రచన, పాత్రోల్లో డెప్తు, అసాధారణ క్లైమాక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Just In

01

Mallu Bhatti Vikramarka:ఈ సాగు చేసే రైతులకు గుడ్ న్యూస్.. 3,745 కోట్ల పెట్టుబడులు1,518 మందికి ఉపాధి

Splitsville review: ఈ బోల్డ్ కామెడీ చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసా..

Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తెలుగు అగ్రనేతలు హతం

Digital Arrest: పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉందంటూ వృద్ధుడి డిజిటల్ అరెస్ట్

Telusu Kada second song: సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ నుంచి సెకండ్ మెలొడీ.. అదిరింది మావా..