Mallu Bhatti Vikramarka: రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ పనిచేస్తున్న తీరును చూసి రాష్ట్రవ్యాప్తంగా వెల్లువలా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramaraka) అన్నారు. సోమవారం సాయంత్రం ముదిగొండ మండల టిఆర్ఎస్(TRS) పార్టీ నాయకత్వం మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కే కాదు రాష్ట్ర ప్రగతికి వేస్తున్న పునాదులను చూసి జిల్లా స్థాయి నాయకులే కాదు శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయి అంటే 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు.
అప్పుల భారం నుంచి..
ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని భావించి శ్రీమతి సోనియా గాంధీ(Sonia Gandhi) ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. దురదృష్టకరం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం కెసిఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది అన్నారు. ఆర్థికంగా, పాలన వ్యవస్థ ను పది సంవత్సరాల్లో విధ్వంసం చేశారని అన్నారు. వారి కుటుంబ అవసరాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని తెలిపారు. వ్యవస్థలను ఎత్తివేసి, వారు సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది, 24 గంటలు పనిచేసిన ఈ వ్యవస్థలను సర్ ఇది ఎందుకు సమయం సరిపోని పరిస్థితి నెలకొంది అన్నారు. అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ప్రధానమంత్రిని, కేంద్ర ఆర్థిక మంత్రిని పలుమార్లు కలిసాం అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో నెలకు 11 వేల కోట్లు వడ్డీలు కట్టడానికే సరిపోయింది అన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలి అన్న సంకల్పంతో 26 వేల కోట్ల అప్పును గత పాలకులు 11.50 శాతంతో తీసుకువస్తే ఆ వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించాం అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఉప్పు, పప్పు ఏది కొనుగోలు చేసిన పన్ను చెల్లిస్తున్నారు వారి పన్నులతోనే అధికారులు ఉద్యోగుల జీతాలు చెల్లిస్తున్నాం, గత పాలకులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం ఈ రాష్ట్ర ఖజానాలోని ప్రతి పైసాకు అధికారులు,
Also Read: OG Movie: లక్షలు పెట్టి టికెట్లు కొంటున్నారు.. ఇది కదా పవన్ కళ్యాణ్ క్రేజ్!
రాష్ట్రంలో ఒక బడి ఒక రోడ్డు..
ఉద్యోగులు సకల జనుల సమ్మె చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేస్తే గత పాలకులు ఉద్యోగులకు సంబంధించిన 15 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా పోయారు మా ప్రభుత్వం రాగానే నెలకు 700 కోట్ల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నామని తెలిపారు. గత పది సంవత్సరాలు అభివృద్ధి అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఉపాధి హామీలో భాగంగా 100 రోజుల పనిలో చేపట్టే కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించే వారిని విమర్శించారు. గత పది సంవత్సరాలు రాష్ట్రంలో ఒక బడి ఒక రోడ్డు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాష్ట్ర ప్రజలకు దక్కలేదు అన్నారు. కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ హయాంలోనే నిర్మించాం కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, అటు గోదావరిపై లక్ష కోట్లు అప్పు తెచ్చి కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కుంగి పోయింది అన్నారు. లక్ష కోట్ల అప్పు తెచ్చారు అవి ఏమైపోయాయో ఎవరికీ తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అన్నారు.
Also Read: Karimnagar District: పోలీసుల లాఠీచార్జికి నిరసనగా సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి