Jubilee Hills Bypoll: ఇప్పటికే మూడు సర్వేలు పూర్తి
సెకండ్, థర్డ్ సర్వేల్లో హస్తం పార్టీ లీడ్
అభ్యర్థుల వారీగా అధ్యయనం
మెజార్టీ మార్కులు వచ్చే లీడర్లకే టికెట్
కాంగ్రెస్‌లో టిక్కెట్ ఫిల్టర్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ పార్టీ మరో రెండు సర్వేలు నిర్వహించనున్నది. ఇప్పటికే మూడు సర్వేలు పూర్తి కాగా, మొదటిది మినహాయిస్తే, రెండు, మూడు సర్వేల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. మొదటి రెండు సర్వేలను పార్టీ వారీగా నిర్వహించగా, థర్డ్ నుంచి అభ్యర్థులు, పార్టీ పేరిట సర్వేలు చేస్తున్నారు. మరో రెండు సర్వేల తర్వాత అభ్యర్థి ఎంపికపై ఓ క్లారిటీ రానున్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. సర్వేల్లో మెజార్టీ మార్కులు పొందినోళ్లకే టిక్కెట్ వస్తుందని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సర్వేలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్ట్రాటజీను అమలు పరుస్తున్నారని, దీంతోనే ఫస్ట్ సర్వేతో పోల్చితే, మిగతా సర్వేల్లో కాంగ్రెస్‌కు గ్రాఫ్ పెరుగుతూ వస్తుందని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో మొదట్నుంచీ సర్వేల ఆధారంగానే టిక్కెట్లు కేటాయింపు అనవాయితీగా వస్తోందని ఆయన వెల్లడించారు.2023 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ వివిధ సర్వేలతోనే అభ్యర్ధులను ఎంపిక చేసింది. ఏఐసీసీ, టీపీసీసీ, సునీల్ కనుగోలు టీమ్స్ వేర్వేరుగా సర్వేలు నిర్వహించి అభ్యర్ధులను ఫిల్టర్ చేశారు. దీంతోనే పార్టీ పక్కాగా ప్లాన్ చేసిన నియోజకవర్గాల్లో గెలుపు తథ్యం అయింది. తద్వారా పార్టీ పవర్ లోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించారు. ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ సర్వే విధానాన్నే ఫాలో అయ్యారు. దీంతో జూబ్లీహిల్స్ తో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సర్వేల ఫాలసీని ఫాలో అవుతామని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు.
Read Also- KTR: స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించండి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రెండు సర్వేల్లోనూ నవీన్ యాదవ్ లీడ్?
ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల్లో మొదటిది తప్పా, మిగతా రెండింటిలోనూ నవీన్ యాదవ్ లీడ్‌లో ఉన్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. సెకండ్ ప్లేస్‌లో సీఎన్ రెడ్డి ఉండగా, ఆ తర్వాతి స్థానంలో బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దిన్‌లు ఉన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లోకల్ నేతకే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ సూత్రపాయ నిర్ణయం తీసుకోవడంతో థర్డ్ సర్వే నుంచి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరుపై కూడా సర్వే చేయిస్తున్నారు. ఐదు సర్వేల తర్వాత అభ్యర్థుల ఎంపిక ఫిల్టర్ జరుగుతుందని టీపీసీసీ నేతలు వివరిస్తున్నారు. అయితే సీఎం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జనబలం కలిగిన నేతలను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీలు, కాలనీల్లోనూ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆయా ప్రజలను ఆకట్టుకునే నేత, జనాలతో కలిసిపోయే లీడర్లను ఎంపిక చేయాలని పార్టీ భావిస్తున్నది. సర్వేల తర్వాత ఏఐసీసీకి రిపోర్టులు పంపనున్నారు. అక్కడ్నుంచే అభ్యర్థి ప్రకటన ఉంటుందని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు.
Read Also- Haris Rauf controversy: పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ భార్య షాకింగ్ పోస్టు.. వివాదానికి మరింత ఆజ్యం
ఈక్వేషన్స్ ఆధారంగా ప్లానింగ్?
బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్ధులు ఏ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇస్తున్నారనే అంశంపై అంచనా వేస్తూ, అభ్యర్ధులపై కాంగ్రెస్ స్టడీ చేస్తున్నది. ప్రత్యర్ధి పార్టీలు ఏ సామాజిక వర్గానికి ఇస్తున్నారో? అని పరిశీలిస్తూ వేర్వేరు బీసీ, ముస్లీం, రెడ్డి, సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ సర్వే చేయిస్తున్నది. 3.87 లక్సల ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో అభ్యర్ధి ఎంపిక పై ఫర్ ఫెక్ట్ గా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉన్నదని పార్టీ నేతలు వివరిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు రిపోర్టు తెప్పించుకుంటున్న సీఎం..కాంగ్రెస్కు మైలేజ్ వచ్చేలా తన ప్లాన్ లను అమలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏకంగా దాదాపు రూ. 200 కోట్లతో శంకు స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. యువత ఉద్యోగాలకు హామీ ఇస్తూ సర్కార్ ముందుకు సాగుతుంది. స్కిల్ డెవలప్ మెంట్ కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నది. ఇక కులాల వారీగా కమ్యూనికేషన్ నిర్వహించేందుకు ఏకంగా ముగ్గురు మంత్రులు, ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్లు ఆ నియోజకవర్గంలో శ్రమిస్తున్నారు. ఇప్పటికే డివిజన్ లు వారీగా ఇన్ చార్జీలను నియమించి, పార్టీ గ్రాఫ్ ను పెంచేందుకు ప్రయత్నించడం గమనార్హం.