Manchu Manoj: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన మంచి హిట్ పడింది. అయితే అది హీరోగా కాదు.. విలన్‌గా. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆయనలానే హీరోగా, విలన్‌గా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. ఇకపై మంచు మనోజ్ ముందుకు వెళ్లనున్నారు. ఈ విషయం స్వయంగా ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పెళ్లి, కుటుంబంలో ఉన్న కలహాల అనంతరం మంచు మనోజ్ మళ్లీ నటుడిగా బిజీ అయ్యేందుకు రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీ ఎంట్రీలో ఆయన ‘భైరవం’, ‘మిరాయ్’ సినిమాలు చేశారు. రెండింటిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే చేశారు. ఈ రెండూ కూడా ఆయనకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. మరీ ముఖ్యంగా ‘మిరాయ్’లో ఆయన చేసిన బ్లాక్ స్వార్డ్ పాత్ర.. మంచు మనోజ్ పర్ఫెక్ట్ రీ ఎంట్రీగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్‌కు ప్రేక్షకుల, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా సక్సెస్‌తో మంచు మనోజ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
Also Read- Adhira Movie: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘అధీర’.. ఫస్ట్ లుక్ అదిరింది
అయోధ్య రాముడి దర్శనం
‘మిరాయ్’ సక్సెస్‌ని పురస్కరించుకుని పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్యకు వెళ్లి, మంచు మనోజ్ శ్రీరాముడిని (Ayodhya Sri Rama) దర్శించుకున్నారు. అయోధ్య నుంచే ‘మిరాయ్’ సినిమా (Mirai Movie) సక్సెస్ టూర్‌ను ప్రారంభిస్తున్నట్లుగా మనోజ్ అనౌన్స్ చేశారు. ఈ టూర్‌లో మొదట హనుమాన్ గఢీని దర్శించి పూజలు చేసిన మంచు మనోజ్.. ఆ తర్వాత అయోధ్య ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read- OG Censor Details: ‘ఓజీ’ సెన్సార్ పూర్తి.. తొలగించిన సన్నివేశాలివే..
రాములవారికి క్షమాపణలు
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో అయోధ్య రావాలని ఎదురు చూస్తున్నాను. ఇది నా డ్రీమ్. ‘మిరాయ్’ సక్సెస్ తర్వాత ఇప్పుడు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అమవాస్య రోజు దర్శనం మంచిదని స్వామిజీలు చెప్పడంతో ఇంకా హ్యాపీగా ఉంది. రాముల వారు యుద్ధంలో గెలిచి ఇక్కడికి వచ్చారు. మేము కూడా సినిమా యుద్ధంలో గెలిచి, విజయం సాధించి ఈ పుణ్యక్షేత్రానికి రావడం సంతోషంగా ఉంది. రాములవారి దర్శనం అద్భుతంగా జరిగింది. ఈసారి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి వస్తాను. అందరూ అయోధ్య శ్రీరాముడిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాను. రామాయణ ఇతిహాసం స్ఫూర్తి ‘మిరాయ్’ మూవీ కథలో ఉంది. ఈ చిత్రంలో నేను బ్లాక్ స్వార్డ్ (Black Sword) పాత్రలో నటించాను. అశోకుడి 9 గ్రంథాల్లో రాసిన రహస్యాలు తెలుసుకుని బ్లాక్ స్వార్డ్ శ్రీరాముడిని ఎదుర్కొనే రావణుడిగా మారతాడు. ఈ పాత్రలో నటించినందుకు అయోధ్య రాములవారికి క్షమాపణలు చెప్పుకున్నాను. మా ‘మిరాయ్’ మూవీ సక్సెస్ టూర్ అయోధ్య నుంచే ప్రారంభమవుతోంది. ఆ శ్రీరాముడి ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు