Adhira Movie: ప్రశాంత్ వర్మ.. ఈ పేరు అందరికీ పరిచయమే. ‘హనుమాన్’ (Hanuman) సినిమాతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). యూనిక్ ఎంటర్‌టైనర్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) అంటూ ప్రకటించి.. తనలోని క్రియేటివిటీని బయటకు తెస్తున్నారు జీనియస్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడాయన లార్జర్-దాన్-లైఫ్ సూపర్ హీరో సినిమా కోసం ఆర్.కె.డి స్టూడియోస్‌తో కలిసి ‘అధీర’ (Adhira Movie) అనే సినిమా చేయబోతున్నారు. టాలీవుడ్‌లో తొలి జాంబీ జానర్ ఫిల్మ్‌తో అలరించిన ప్రశాంత్ వర్మ, ఆ తర్వాత ఇండియన్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’తో సంచలనాన్ని సృష్టించారు. అదే డ్రీమ్‌ని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా ‘అధీర’ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత (ఓజీ నిర్మాత) డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి (Kalyan Dasari) హీరోగా గ్రాండ్ డెబ్యూ ఇవ్వబోతుండగా.. ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు, మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎస్.జె. సూర్య (SJ Suryah) కనిపించనున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపుదిద్దకోనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను రివాజ్ రమేష్ దుగ్గల్ నేతృత్వంలోని ఆర్కేడీ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
Also Read- OG Censor Details: ‘ఓజీ’ సెన్సార్ పూర్తి.. తొలగించిన సన్నివేశాలివే..
హీరో కొడుకు కాదు.. నిర్మాత కొడుకు
వాస్తవానికి ప్రశాంత్ వర్మకు ఈ మధ్య నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజను పరిచయం చేసే అవకాశం వచ్చింది. సినిమా ఓపెనింగ్ మరుసటి రోజు అనే సందర్భంలో ఈ సినిమా సడెన్‌గా ఆగిపోయింది. అందుకు కారణం ఏంటనేది ఇప్పటి వరకు అయితే తెలియలేదు కానీ, ఇప్పుడో నిర్మాత తనయుడిని ‘అధీర’గా పరిచయం చేసే అవకాశాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు దర్శకుడు తను కాకపోయినా, వెనుక ఉండి అంతా చూసుకునేది తనే అని తెలియంది కాదు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా, భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో విజువల్ ఫీస్ట్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రతి కథా వైవిధ్యంగా, ఒకే యూనివర్స్‌లో బ్లెండ్ అయ్యేలా ప్రశాంత్ వర్మ తన సూపర్ హీరో డ్రీమ్ యూనివర్స్‌కు బలమైన పునాది వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘అధీర’కు సంబంధించి సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో మేకర్స్ కళ్యాణ్ దాసరి, ఎస్.జె. సూర్య వీరోచిత లుక్‌లో ఉన్న ఫస్ట్ లుక్ (Adhira First Look) పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Sai Durgha Tej: వేటకు సిద్ధమైన బెంగాల్ టైగర్.. సాయి దుర్గ తేజ్ ‘ఓజీ’ ట్రైలర్ రివ్యూ
ఫస్ట్ లుక్ అదిరింది
ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే.. బ్యాక్‌డ్రాప్‌లో ఒక అగ్నిపర్వతం పేలి.. మంటలు, లావా, బూడిద ఆకాశాన్ని కప్పేస్తున్నాయి. ఆ కల్లోలంలో నుంచి ఎస్‌జె సూర్య బుల్ లాంటి కొమ్ములతో, ట్రైబల్ దుస్తుల్లో, క్రూరమైన రాక్షసుడిలా కనిపిస్తుంటే, అతని ముందే కళ్యాణ్ దాసరి మోకాళ్లపై కూర్చుని ధైర్యంతో పైకి చూస్తూ మోడరన్ వార్ అవతార్‌లో ట్రూ సూపర్ హీరోలా వినాశనాన్ని ఆపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పోస్టర్ ఒక మహా సంగ్రామానికి నాంది పలుకుతున్నట్లుగా ఉంది. ఇది ఆశ వర్సెస్ అంధకారం మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తలపిస్తుంది. ధర్మాన్ని రక్షించడానికి కళ్యాణ్ దాసరి తన సూపర్ పవర్స్‌ని వాడుతున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలపనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు