MLC Kavitha (imagecredit:swetcha)
తెలంగాణ

MLC Kavitha: తెలంగాణ సాధించిన చంద్రునికి కొందరు మచ్చ తెచ్చారు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: తెలంగాణ ఉద్యమ సారధి చింత మడక గ్రామ ముద్దుబిడ్డ కే సీ ఆర్ తెలంగాణ ఉద్యమ చేసి తెలంగాణను సాధించి,దేశ, రాష్ట్ర చరిత్రను మార్చారని అలాంటి వ్యక్తికి కొందరు మచ్చ తెచ్చారు. అదే విషయాన్ని నేను చెపితే కుట్రలు చేసి పార్టీకి, కుటుంబానికి దూరం చేశారని జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో ఆదివారం జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాల వేదిక ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. పరోక్షంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ను టార్గెట్ చేస్తూ ప్రసంగించారు.

హరీష్ రావు పై ధ్వజం..

సిద్దిపేట, చింతమడక ఎవరి జాగీరు కాదు, ఆంక్షలు పెడితే మళ్ళీ మళ్ళీ, సిద్దిపేటకు, చింతమడకకు వస్తానంటూ కవిత హెచ్చరించారు. 2004 లో కేసీఆర్(KCR) మెదక్(Medak) ఎంపీగా పోటీ చేసి ఇక్కడ ప్రత్యేక పరిస్తితుల్లో ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావు ను మంత్రిని చేశారని పరోక్షంగా హరీష్ రావు పై ధ్వజమెత్తారు. అప్పటి నుంచి సిద్దిపేట, చింతమడకలో ఆంక్షలు పెడుతున్నారని బహిరంగంగా కవిత ప్రకటించారు.కేసీఆర్ కు మచ్చ తెస్తున్నారని పార్టీలో మాట్లాడానని అందుకే తనను కుట్రలు చేసి పార్టీకి తల్లిదండ్రులకు, పాపారని కన్నీటి పర్యంతం అయ్యారు. తెలంగాణ ఉద్యమంలోనే తూటాలకు బయపడలేదని, ఆంక్షలకు బయటపడేది లేదని పరోక్షంగా హరీష్ రావు పై ధ్వజమెత్తారు.

Also Read: Telangana Excise: దుమ్ము రేపుతున్న ఎక్సైజ్ పోలీసులు.. రెండు రోజుల్లో 35 లక్షల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్

పెండ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వెళితేనే..!

పెళ్లి చేసుకొని ఆడబిడ్డ అత్తగారింటికి వెళ్తేనే పుట్టింటి వారికి ఎంతో బాధ ఉంటుందని, అలాంటి బాధలో ఉన్నప్పుడు అమ్మగారి ఊరు ఆడబిడ్డ ల, చింతమడక(Chinthamadaka) గ్రామానికి తనను పిలిచి అండగా నిలబడ్డారని చెప్పారు. ప్రశ్నించినందుకు తనను కుట్రలు చేసి పార్టీ నుండి చివరకు, తల్లిదండ్రుల నుండి తనను వీడదీశారని ఆవేదన చెందారు. దుఃఖంలో ఉన్న తనకు చింతమడత గ్రామం అండనిచ్చిందని అన్నారు. చింత మడక చరిత్ర సృష్టించిందని భవిష్యత్తులో మరోసారి భూకంపం పుట్టిస్తుందనీ కల్వకుంట్ల కవిత అన్నారు.

అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

చింతమడక గ్రామంలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జరిగాయి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో గ్రామంలోని మహిళలు భారీ స్థాయిలో పాల్గొని విజయవంతం చేశారు. డిజె సౌండ్ ,ఆట పాటలతో బతుకమ్మ సంబరాలు జరిగాయి. గ్రామ ఆడబిడ్డలతో కలిసి కవిత బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

Also Read: Tollywood Hero: పుట్టినరోజున ఈ హీరో ఏం చేశాడో చూశారా?

Just In

01

IBPS: గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం.. ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య!

Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు