Manchu Manoj: మంచు మనోజ్ గురించి పరిచయం అవసరం లేదు. ‘మిరాయ్’ చిత్రంతో ఆయన మంచి ఫామ్‌లోకి వచ్చాడు. అదీ ఓ విలన్‌గా.. ఈ యాక్షన్-అడ్వెంచర్, మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మనోజ్ నటనకు ఆడియెన్స్ నుండి విమర్శకుల వరకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పవన్ సలహా వల్లే తాను ‘మిరాయ్’ సినిమా చేశానని, ఆ చిత్రంతో వచ్చిన ప్రశంసలకు పవన్ కళ్యాణ్‌నే కారణంగా చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Also Read: Pawan Kalyan: ‘ఓజీ’ కోసం పవన్ కళ్యాణ్ ఆ రూల్ బ్రేక్ చేశాడా? ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా..!
మనోజ్ మాట్లాడుతూ, “ పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తారు. ఒకసారి ‘భీమ్లా నాయక్’ షూటింగ్ సమయంలో ఆయనతో చాలా సేపు మాట్లాడాను. అప్పుడు పవన్ నా కెరీర్ గురించి చెబుతూ, ‘నీవు నెగెటివ్ రోల్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. విలన్‌గా నీవు చేస్తే ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ అవుతావ్, ఒక్కసారి ట్రై చెయ్’ అన్నారు. ఆ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. ఆ సలహాతోనే ‘మిరాయ్’ కథను ఒప్పుకున్నా. ఈ చిత్రంతో వచ్చిన ప్రశంసలకు పవన్‌నే క్రెడిట్ ఇస్తా,” అని చెప్పాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: Telugu movies Oscar 2025: ఆస్కార్ రేసులో ప్రపంచ స్థాయి సినిమాలతో పోటీపడుతున్న తెలుగు చిత్రాలు ఇవే..
‘మిరాయ్’ సినిమా విషయానికొస్తే, ఈ సినిమాలో తేజ సజ్జ, రితిక నాయక్ జంటగా నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ విజువల్ వండర్ భారీ అంచనాల నడుమ విడుదలైంది. మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా, కేవలం ఐదు రోజుల్లో రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ముందు ముందు ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: Telugu movies Oscar 2025: ఆస్కార్ రేసులో ప్రపంచ స్థాయి సినిమాలతో పోటీపడుతున్న తెలుగు చిత్రాలు ఇవే..