Top Stories, క్రైమ్

Judiciary: రావుల రాజ్యంలో.. కేసుల పేరుతో ఆడిందే ఆట

గులాబీ.. బినామీ.. సునామీ పార్ట్-5

– న్యాయశాఖనూ వదలని బీఆర్ఎస్ సర్కార్
– ఉన్నన్నాళ్లూ అడిషనల్ ఏజీకి లెక్కకు మించి డబ్బు
– ప్రతేక్య జీవోలు ఇచ్చి మరీ పైసలిచ్చిన వైనం
– బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునేందుకు పనికొచ్చిన జీవోలు
– ఇతర కులాల వారిని పట్టించుకోని ఆ వర్గం లాయర్లు
– జీపీలకు, ఏజీపీలకు తీవ్ర నష్టం
– హైకోర్టును ఆశ్రయించిన జీపీలు
– ప్రభుత్వ భూములకు ఓపీనియన్స్ ఇచ్చి పోగేసిన వేల కోట్ల సంపద
– తెలంగాణకు ముందు ఇల్లు, ఆఫీస్ లేని రామచంద్రారావు
– వేల కోట్లలో ఆస్తులు.. ఇంద్రభవనం లాంటి ఇళ్లు
– బినామీల పేర్లపై వందల కోట్ల ఆస్తులు

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

BRS Govt: తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదిన్నరేళ్లు పాలించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇన్నేళ్లలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందనే విమర్శలున్నాయి. అన్నింటా కమీషన్ల దందా నడిపించారని, ఆఖరికి న్యాయవ్యవస్థను కూడా ఇష్టానుసారంగా వాడుకున్నారని తెలుస్తోంది. ఉద్యమ సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి న్యాయవాదులను ముందు పెట్టి, అధికారం వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థను అంతా వారి గుప్పిట్లో ఉంచుకున్నారు. దీనికి చక్కటి ఉదాహరణ అడిషనల్ ఏజీ జే రామచంద్ర రావు. ఈయన మొదటి ఏడాదిలోనే అక్రమాలకు పాల్పడితే అప్పటి సీఎం కేసీఆర్‌కి ఫిర్యాదులు చేశారు ఏజీ. ట్విస్ట్ ఏంటంటే, రామచంద్రరావుపై ఫిర్యాదు చేసిన ఏజీ రామకృష్ణారెడ్డినే తీసివేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 25 మంది జీపీలు, 31 మంది ఏజీపీలు ఉండే హైకోర్టులో ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత 48 మంది జీపీలను, 50 మందికి పైగా ఏజీపీలను నియామకం చేశారు. అయితే, ఇందులో అధికార వర్గానికి చెందిన ఏడుగురు జీపీలుగా, 10 మంది ఏజీపీలుగా ఉన్నారు. కీలకమైన సబెక్ట్స్ ఆ కులానికి చెందిన వారికే కేటాయించారు. ఏజీపీలపై నిఘా ఉంచేందుకు వివిధ జీపీల వద్ద ఉంచారు. దీంతో హైకోర్టులో వెలమ రాజ్యం మాఫియా ఏలిందనేది న్యాయవాదుల మాట.

అప్పనంగా రూ.3.5 కోట్లు దొచిపెట్టారు

ఎవరికీ లేని విధంగా మాజీ ఏఏజీపీకి ప్రత్యేక జీవోలతో మూడున్నర కోట్ల రూపాయలు దొచిపెట్టారు. ఆ వైట్ మనీతో వందల కోట్ల విలువ చేసే భూములను మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కొనుగోలు చేశారు. జీవో నెంబర్ 177(తేదీ 10-03-2017)తో కేసుకు 5 వేలు, రోజుకు 5 నుంచి 7 కేసుల వరకు పెంచుకున్నారు. ఇది రామచంద్రరావు అపాయింట్మెంట్ డేట్ అయిన 23-06-2014 నుంచి వర్తిస్తుందని తెలిపారు. పెంచిన సొమ్ముతో చెల్లించాల్సిన మొత్తం రూ.67 లక్షల 46 వేలు. అలాగే, రూ.38 లక్షల 31 వేలు అదనంగా చెల్లించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. మరో జీవో నెంబర్ 318 (తేదీ 05-07-2018) విడుదల చేశారు. అప్పియిరెన్స్‌కి 5 వేల నుంచి రూ.8,500 లకు పెంచారు. దీంతో 2015 నుంచి రూ.47 లక్షల ఏడు వేలు అయింది. 2017 నుంచి 2018 వరకు 3573 అప్పియిరెన్స్‌కి రూ.17 లక్షల 43 వేలు రీలీజ్ చేశారు. ఎవరైనా పెంచిన జీతాలు, బత్తాలు ఆ రోజు నుంచి వర్తిస్తాయి. కానీ, వీరికి అపాయింట్మెంట్ తేదీ నుంచే వర్తించేలా జీవోలు తీసుకొచ్చారు. వీటికి తోడుగా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ పేరుతో 394 లీగల్ అడ్వైజర్స్ అండ్ కౌన్సిల్స్ ప్రొఫెషనల్ సర్వీస్‌లు అంటూ ఎంతో సొమ్మును కాజేశారని సమాచారం.

జీపీలకు, ఏజీపీలకు మొండిచేయి

అడిషనల్ అడ్వకేట్ జనరల్‌కి అడ్డగోలుగా పెంచుకుంటూ పోయినా, జీపీలకు, ఏజీపీలకు పెంచిన జీతాలను మాత్రం ఇవ్వలేదు. అందుకు ఒక్కొక్క న్యాయవాది 90 వేల వరకు నష్టపోయారు. వారికి ఇచ్చే నెల జీతం 75 వేలకు పెంచారు. కానీ, ఇష్టానుసారంగా వ్యవహరించినందుకు ఓ న్యాయవాది హైకోర్టులో రిట్ పిటిషన్ (నెంబర్ 21704/2018) దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఆస్తులపై విచారణ జరిపించే ధైర్యం ఉందా?

న్యాయ దేవత కళ్లకు గంతలు కట్టినట్టే వివిధ రూపంలో ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కొట్టేశారు. అప్పట్లో స్మితా సబర్వాల్ పరువు నష్టం కేసులో ప్రభుత్వం 15 లక్షలు ఇవ్వగా సుప్రీంకోర్టులో ఇంకా కేసు కొనసాగుతోంది. ఇలా వివిధ వాదనల పేర్లతో కమీషన్స్ తీసుకుని ఢిల్లీ నుంచి న్యాయవాదులను పిలిపించి అడ్డగోలుగా దొచిపెట్టారు. ఆర్టీసీ సమ్మె కేసు మొదలుకొని ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల లీకేజీల వరకు చాలా వ్యవహారాలే ఉన్నాయి. ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములకు ఒపీనియన్స్ ఇచ్చి సంపాదించింది వేల కోట్ల వరకు ఉంటుంది. అడ్వకేట్ జనరల్ ఇవ్వాల్సిన ఓపీనియన్స్ కూడా రామచంద్ర రావు ఇచ్చి మూడో కంటికి తెలియకుండానే దోచేసుకున్నాడు. ఈయన ఆస్తులు ఎలా పెరిగాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? అవి ఎలా వచ్చాయో తర్వాతి కథనంలో చూద్దాం.

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు