- మోదీ ప్రభుత్వాన్ని గట్టెక్కించిన దక్షిణాది రాష్ట్రాలు
- ప్రతి బడ్జెట్ లోనూ దక్షిణాదిపై వివక్ష చూపిన ఎన్డీఏ
- ఉత్తరాది రాష్ట్రాలకే నిధులు ఇచ్చిన మోదీ సర్కార్
- ప్రతి బడ్జెట్ లోనూ తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం
- మోదీ సర్కార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న తెలుగు రాష్ట్రాలు
- హిందీ బెల్ట్ లో బీజేపీకి వ్యతిరేక పవనాలు
- కర్ణాటకలో 19 స్థానాలు నిలబెట్టుకున్న బీజేపీ
- కేరళలో ఎంపీగా బోణీ చేసిన హీరో సురేష్ గోపి
Two telugu states support to modi to get the hattrick:
దశాబ్దకాలంగా దక్షిణాది రాష్ట్రాలు కేవలం పన్నులు వసూలు చేసి కేంద్రానికి ఇచ్చే బలిపశువులుగా మరుతున్నాయే తప్ప…కేంద్రం నుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నాయి.
సౌత్ రాష్ట్రాలు వాటి మౌలిక అభివృద్ధికి కావలసిన నిధులు చాలక అప్పులు తెచ్చుకుంటున్నాయి. కేంద్రం నుంచి కూడా అప్పులు తెచ్చుకుంటున్నాయి. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలు కేంద్రం నుంచి గ్రాంటులు పొందుతున్నాయి. అప్పులు అయితే తిరిగి కట్టాల్సిందే. అదే గ్రాంటులైతే తిరిగి కట్టనవసరం లేదు. తెలుగు రాష్ట్రాలకు గ్రాంట్ల విషయంలో మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తూనే వచ్చింది. పైగా భారీ నిధులు లేవు. భారీ ప్రాజెక్టులు లేవు. రైల్వే బడ్జెట్ లోనూ తీరని అన్యాయమే జరుగుతూ వస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు మెండి చెయ్యి
నిజానికి దక్షిణాది రాష్ట్రాలు చేయగల అప్పుల మీద కేంద్రం పరిమితి విధించడంతో ఆ వసతి కూడా లేకుండా పోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కోరిన ఏ ప్రాజెక్టునూ ఎన్‌డిఎ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మంజూరు చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకూ కేంద్రం కీలక బడ్జెట్లో భారీ ప్రాజెక్టులు గానీ, నిధులు గానీ కేటాయింపులు జరగలేదు. అయితే నాలుగు వందల మెజారిటీ వస్తుందనుకున్న బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక మిత్ర పక్షాల సీట్లపై ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడింది.
కష్టకాలంలో ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు
కీలక రాష్ట్రాలలో ఇక తమకు ఎదురులేదని భావించిన ఎన్టీఏ కూటమికి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఈ కష్టకాలంలో దక్షిణాది రాష్ట్రాలే మోదీని ఆదుకోవడం గమనార్హం. అందులో ప్రధమ స్థానం ఏపీ కి చెందిన కూటమిదే. 2019 లోక్ సభ ఎన్నికలలో ఏపీలో కనీసం ఖాతా కూడా ఓపెన్ చేయని బీజేపీకి కూటమితో మిత్రబంధం కలిసొచ్చింది. అలాగే తెలంగాణలోనూ కాంగ్రెస్ తో పోటీపడి 8 స్థానాలు దక్కించుకుంది. ఈ రెండు రాష్ట్రాల ఓట్లే ఇవాళ బీజేపీ కి దిక్సూచిగా మారాయి.
మిత్ర పక్షాలే దిక్కు..
గత ఎన్నికల్లో ఎన్టీయే కూటమిలో మిత్ర పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా బీజేపీకి దేశమంతా కలిపి 303 సీట్లు వచ్చాయి. ఈసారి ఆ పరిస్థితిలేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో అనుకున్న స్థానాలను సాధించుకోవడంలో వెనకబడిన బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ 2024 ఎన్నికల్లో దక్కలేదని ఫలితాలు తెలుపుతున్నాయి. . అయితే కూటమి మిత్ర పక్షాల సీట్లు కలుపుకుంటేనే బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చింది. అందులో ఏపీలో లోక్‌సభ సీట్ల కీలకంగా మారాయి.
కమలాన్ని ఆదుకున్న కర్ణాటక
సౌత్ మొత్తం మీద కమలాన్ని ఆదుకున్న రాష్ట్రం కర్ణాటక. వాస్తవానికి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా ఎన్డీఏ కూటమి 19 స్థానాలను గెలుచుకోవడం విశేషం. అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీ 9 సీట్లకే పరిమితం అయింది. ఇక కమ్యూనిస్టుల కంచుకోట కేరళలోనూ బీజేపీ పాగా వేసింది. త్రిన్పూర్ లో బీజేపీ అభ్యర్థిగా సినీ హీరో సురేష్ గోపి ఘన విజయం సాధించారు.