Ilaiyaraaja-Live-Concert(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Ilaiyaraaja Live Concert: ఫస్ట్ టైమ్ ఏపీలో ఇళయరాజా సంగీత కచేరి.. ఎప్పుడంటే?

Ilaiyaraaja Live Concert: భారతీయ సంగీత ప్రపంచానికి ఇళయరాజా అంటే తెలియని వారుండరు. ఆయన సంగీత కచేరీ చేస్తున్నారంటే రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన కచేరీ చూడటానికి వస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఇళయరాజా సంగీత కచేరి మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించనున్నారు. దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అక్కడి నిర్వాహకులు సన్నద్ధత అవుతున్నారు. ఈ సంగీత విభావరి విజయవాడ ఎంజి రోడ్ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవంబర్ 8వ తేదీ శనివారం కనీవినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విజయవాడలోనే ట్రెండ్ సెట్టర్స్ లైవ్ సుధాకర్ ఈ లైవ్‌ కన్సర్ట్‌ ను నిర్వహిస్తున్నారు. ఈ సంగీత కచేరీకి సంబంధించిన పోస్టర్‌ ను ఇళయరాజా తో పాటు, ఏపీ ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ విడుదల చేశారు. దీంతో ఏపీ ప్రజలు ఈ కచేరీ చూడటానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Read also-Jupally Krishna Rao: డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. అవసరమైతే ఆయుధాలు ఇస్తాం.. ప్రభుత్వం కీలక ప్రకటన

ఈవెంట్ కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే బుక్ మై షో లో పొందుపరచగా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో ఈ సంగీత విభావరి కార్యక్రమం కోసం గట్టి భద్రత, సకల సౌకర్యాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రెండ్ సెట్టర్స్ సుధాకర్ గారు మాట్లాడుతూ.. “సినీ సంగీతానికి జీవనాడిగా ఉన్న ఇళయరాజా తో కలిసి ఈ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇళయరాజా గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న లైవ్ కన్సర్ట్‌ కావడంతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నాం.’ అని అన్నారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన టిక్కెట్లను బుక్ మై షో యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. 40 మంది సభ్యుల బృందంతో ఇళయరాజా ఈ లైవ్ కన్సర్ట్ కు హాజరవుతున్నారు. ఏపీలో ఇలాంటి మ్యూజికల్ కన్సర్ట్ ను ఇంత లార్జ్ స్కేల్ లో నిర్వహించడం ఇదే మొదటిసారి” అని చెప్పారు.

Read also-Anuparna Roy: గురువు మాట కూడా లెక్కచేయని వెనీస్ అవార్డు గ్రహీత.. ఎందుకంటే?

ఇళయరాజా సంగీతానికి దాసులు అవని వారుండరు. అంతటి ప్రతిభ కలిగిన విధ్వాసులు ఆంధ్రప్రదేశ్ లో కచేరీ నిర్వహించడంతో అక్కడి వారికి ఆయన్ను చూసి, ఆయన పాటలు ప్రత్యక్షంగా వినే అదృష్టం కలుగుతుంది. ఇళయరాజా ఇప్పటివరకూ దాదాపు 1000కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. అందులో ఎక్కువగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలు ఉన్నాయి. ‘సాగరసంగమం’, ‘సింధు భైరవి’, ‘రుద్రవీణ’ చిత్రాలకు జాతీయ చిత్ర పురస్కారాలు గెలుచుకున్నాడు. మొత్తం ఐదు జాతీయ చిత్ర పురస్కారాలు, పద్మభూషణ్ (2010), పద్మవిభూషణ్ (2018) వంటి గొప్ప గౌరవాలు పొందాడు. 2012లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2022లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఇళయరాజా సంగీతం భారతీయ క్లాసికల్, ఫోక్, వెస్టర్న్ ఆర్కెస్ట్రా మిక్స్. మొదటి భారతీయుడిగా పూర్తి వెస్టర్న్ సింఫనీ కంపోజ్ చేసి, రాయల్ ఫిల్‌హార్మానిక్ ఆర్కెస్ట్రాతో 1993లో రికార్డ్ చేశాడు.

Just In

01

Manchu Manoj: ముందు అక్క సినిమా వస్తోంది.. తర్వాత ‘ఓజీ’.. మూవీ లవర్స్‌కు ఫీస్ట్!

Modi Manipur visit: జోరు వానలో హెలికాప్టర్ వద్దన్న భద్రతా సిబ్బంది.. మోదీ డేరింగ్ నిర్ణయం!

Mahesh Kumar Goud: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. పీసీసీ చీఫ్​ సంచలన కామెంట్స్

Telangana Govt: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్… మండలానికో సెంట్రింగ్ యూనిట్!

Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్!