Mirai success meet: తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రదాన పాత్రల్లో రూపొందిన ‘మిరాయ్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ రాబట్టుకుంది. దీంతో నిర్మాతలు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘తేజ సజ్జాను, నన్ను, కార్తిక్ ను నమ్మి ఇంత పెద్ద సినిమాలో భాగం చేసినందుకు నిర్మాత విశ్వ ప్రసాద్ చాలా రుణపడి ఉంటాను ’ అని అన్నారు. అంతే కాకుండా..‘ఈ సినిమాను మొదలు పెట్టినపుడు చాలామంది చెప్పే ఉంటారు నా గురించి. చాలా ప్లాపుల్లో ఉన్నాడు. ఈ సమయంలో సినిమా ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆలోచించుకోండి అని నిర్మాతకు చెప్పే ఉంటారు. కానీ ఆయన మాత్రం వాటన్నింటినీ నమ్మకుండా మనోజ్ నువ్వే చెయ్యగలవు ఏం కాదు అని ధైర్యం చెప్పారు నిర్మాత. అప్పుడు ఆయన నన్ను నమ్మడం వల్లే ఈ రోజు నేను ఇలా ఉన్నాను. నన్ను నా కుటుంబాన్ని మీరే నిలబెట్టారు అని’ సక్సెస్ మీట్ లో మనోజ్ ఎమోషనల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత మంచి హిట్ సినిమా రావడంతో మనోజ్ ఎక్కడ చూసినా సంబరాలు చేసుకుంటున్నారు.
Read also-Congress: మణిపూర్‌లో ప్రధాని పర్యటన.. లాజిక్ ప్రశ్నలతో ఏకిపారేసిన కాంగ్రెస్
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ఒక భారీ పాన్-ఇండియా యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. ‘మిరాయ్’ అనే టైటిల్ జపనీస్ పదం, దీని అర్థం ‘భవిష్యత్తు కోసం ఆశ’. ఈ సినిమా అశోకుడి కళింగ యుద్ధం తర్వాత రహస్య గ్రంథాలను కాపాడే తొమ్మిది మంది యోధుల కథ ఆధారంగా రూపొందింది. ఇందులో పురాణ చారిత్రక అంశాలు ఫాంటసీతో మేళవించబడ్డాయి. తేజ సజ్జా సూపర్ యోధుడి పాత్రలో నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా, శ్రియా శరణ్ తల్లి పాత్రలో, జగపతి బాబు, జయరాం వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. గౌర హరి సంగీతం అందించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read also-Kishkindhapuri collections : ‘కిష్కింధపురి’ మొదటిరోజు కలెక్షన్స్ ఇంతేనా.. హిట్ టాక్ తెచ్చుకున్నా?
తేజ సజ్జా హీరోగా నటించిన సూపర్ హీరో మూవీ ‘మిరాయ్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మొదటి రోజు బాక్సాఫీస్ గోడలు బద్దలుగొట్టింది. అన్ని భాషల్లో కలిపి రూ.21 కోట్లు సంపాదించినట్టు అంచనా. ఈ సినిమా ప్రేక్షకులను ఒక ప్రత్యేక సినిమాటిక్ యూనివర్స్‌లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ తేజ సజ్జా పాత్ర అయిన సూపర్ యోధుడు, ఎంపరర్ అశోకుని తొమ్మిది పవిత్ర గ్రంథాలను కాపాడాల్సి ఉంటుంది. ఈ గ్రంథాలు మానవులను దైవిక స్థాయికి ఎదగబెట్టే శక్తిని కలిగి ఉంటాయట. అయితే, మహావీర లామా అతని బ్లాక్ స్వోర్డ్ ఆర్మీ ఈ గ్రంథాలపై ఆకాంక్ష చూపిస్తారు. ఈ కథలో యాక్షన్ సీక్వెన్స్‌లు, ఫాంటసీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమా తెలుగు మార్కెట్‌లో బలమైన ట్రాక్షన్ సాధించింది. మొదటి రోజు తెలుగు షోల్లో 68.59% ఓక్యుపెన్సీ రికార్డ్ చేసింది. మార్నింగ్ షోల్లో 56.20% నుంచి నైట్ షోలకు 83.81% వరకు గణనీయమైన పెరుగుదల కనిపించింది.
#ManchuManoj – BECOMES EMOTIONAL – For giving him a CHANCE in #MIRAI Film – Happy For his Success.
— GetsCinema (@GetsCinema) September 13, 2025