little-hearts(image:x)
ఎంటర్‌టైన్మెంట్

Mouli viral video: మౌళి అప్పుడు సరదాగా చేసింది ఇప్పుడు నిజమైంది.. అది ఏంటంటే?

Mouli viral video: చిన్న సినిమాగా వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ మూవీ ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఆ సినిమాలో లీడ్ రోల్ చేసిన మౌళి ఎప్పుడో చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యూట్యూబ్ లో సరదాగా జోకులు వేసి నవ్వించే మౌళి అనుకోకుండా ఓ రోజు చేసిన వీడియో నేడు నిజం అయ్యింది. వీడియోలో.. ఇదే ఇదే విజయ్ దేవరకొండ ఇల్లు హాయ్ చెబుతున్నాడు చూడండి, అంటూ హాయ్ హాయ్.. నన్ను బిరియానీ తినడానికి పిలుస్తున్నారు. వస్తున్నా వస్తున్నా’.. అంటూ సరదాగా చేసిన ఓ వీడియో ఇప్పుడు నిజమైంది. లిటిల్ హార్ట్స్ లో తన నటనతో అందరిమన్ననలు అందుకుంటున్నాడు మౌళి. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మూవీ టీంని పిలిపించి విందు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతన్నాయి. మౌళి ఎప్పుడో చేసిన వీడియో ఇప్పుడు నిజమైందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదే కదా సక్సెస్ అంటే అని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక మీమర్ గా మెదలై ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కనిపించడం చాలా గర్వించదగ్గ విషయం. మౌళి ఈ జర్నీ ఎందరికో ఆదర్శం అంటే ఇప్పటికే చాలా మంచి చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Read also-Dog in Class Room: టీచర్ ప్లేస్‌లో శునకం.. అవాక్కైన విద్యార్థినులు.. ఇదేందయ్యా ఇది!

లిటిల్ హార్ట్స్ సినిమా సాయి మార్తాండ్ దర్శకత్వంలో, అదిత్య హసన్ నిర్మాణంలో రూపొందిన సినిమా. హీరో అఖిల్ (మౌలి తనుజ్ ప్రశాంత్) EAMCET పరీక్షలో విఫలమైన తర్వాత కోచింగ్‌లో చేరతాడు. అక్కడ అతను కాత్యాయనీ (శివాని నగరం) అనే అమ్మాయిని కలుస్తాడు. ఆమె వింత ప్రత్యేకతలతో అతని ప్రేమను తిరస్కరిస్తుంది, కానీ అఖిల్ మాత్రం తన మునుపటి హార్ట్‌బ్రేక్ అనుభవాల నుండి నేర్చుకుని, హాస్యాస్పదంగా ఆమె మనసు గెలవడానికి ప్రయత్నిస్తాడు. ఇది టీనేజ్ లవ్ స్టోరీని సరళంగా, సానుకూలంగా చూపిస్తూ, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిన సినిమా.

మౌలి తనుజ్ ప్రశాంత్ (అఖిల్), శివాని నగరం (ఖత్యాయనీ), రజీవ్ కనకాల (సపోర్టింగ్ రోల్), సత్య కృష్ణన్, ఎస్.ఎస్. కాంచి, అనిత చౌదరి మొదలైనవారు. బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్‌గా నిలిచింది – మొదటి 6 రోజుల్లో భారతదేశంలో ₹13.65 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹21.50 కోట్లు సమకూర్చుకుంది. IMDb రేటింగ్ 8.2/10.సినిమా హల్‌చల్ కలిగించే కామెడీ, ఫీల్-గుడ్ వైబ్స్‌తో ఆకట్టుకుంది. నాని వంటి స్టార్స్ కూడా ప్రశంసించారు. యంగ్ టీమ్ సినిమాగా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు సరిపోతుంది – వల్గరిటీ లేకుండా, ప్యూర్ ఫన్ రొమాన్స్ తో అందరి మనసులు గెలుచుకుంది.

Read also-Mirai collections: తేజ సజ్జా ‘మిరాయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?.. సంబరాలు చేసుకుంటున్న మూవీ టీం

మౌళి తనుజ్ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా పాపులర్. అతని చార్మింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, నేచురల్ యాక్టింగ్ స్కిల్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT)లో చదువుకున్నాడు. కెరీర్ ప్రారంభం ETV ఒరిజినల్స్ హిట్ సిరీస్ “#90s: A Middle Class Biopic”తో జరిగింది. ఇందులో రఘు తేజ పాత్రలో నటించి, నాస్టాల్జిక్ స్టోరీలు ఇష్టపడే వారిని ఆకర్షించాడు. “Hostel Days” (2023) వెబ్ సిరీస్‌లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. “లిటిల్ హార్ట్స్” (2025)లో హీరో అఖిల్ పాత్రలో నటించాడు. ఈ రొమాంటిక్ కామెడీ సెప్టెంబర్ 12, 2025న విడుదలై, బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.

Just In

01

Mahabubabad Cyclone Montha: మహబూబాబాద్ జిల్లాలో మొంథా బీభత్సం.. నిలిచిపోయిన పలు రైళ్లు.. రంగంలోకి జిల్లా ఎస్పీ!

TG CM – Cyclone Montha: తెలంగాణపై మెుంథా ఎఫెక్ట్.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

Government Lands: త్వరలో ప్రభుత్వానికి అందనున్న నిషేధిత భూముల జాబితా..!

Jubilee Hills Bypoll: మీకు అభివృద్ధి కావాలా.. అబద్ధాలు కావాలా.. జూబ్లీహిల్స్ ఓటర్లకు పొన్నం అల్టిమేటం!

Gadwal District: సెటిల్మెంట్లు అక్రమ వసూళ్లకు కేరాఫ్‌గా కేటిదొడ్డి పోలీస్ స్టేషన్.. ఎక్కడంటే..!