Degree Seats Vacant: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో సీట్లు భారీ మొత్తంలో మిగిలిపోయాయి. కనీసం సగం సీట్లు కూడా నిండకపోవడం గమనార్హం. తెలంగాణ(Telangana)లోని ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే కాలేజీల్లోనూ ఖాళీలు ఉండటం గమనార్హం. గతంలో ఆ కాలేజీల్లో సీట్ల కోసం ఎమ్మెల్యేలు(MLAS), అధికారులతో పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఖాళీలు దర్శనమిస్తున్నాయి. అయితే విద్యార్థులు డిగ్రీ(Degree) కోర్సుల్లో కాకుండా ఇతర కోర్సులకు వెళ్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే గతంలోనూ ఇంతే మొత్తంలో ఖాళీలు ఉండేవని అధికారులు చెబుతున్నారు. ఈ మిగిలిన సీట్ల భర్తీకోసమే ప్రభుత్వ కాలేజీల్లోనూ స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించినట్లు చెబుతున్నారు.
యూనివర్సిటీ పరిధిలో
తెలంగాణలో ప్రభుత్వ, ప్రభుత్వ అటానమస్(Autonomous), ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ అటానమస్, రైల్వే డిపార్ట్ మెంట్, యూనివర్సిటీ అటానమస్, యూనివర్సిటీ పరిధిలో కాలేజీలతో పాటు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, మేనేజ్ మెంట్ కాలేజీలు కలిపి మొత్తం 967 ఉన్నాయి. వీటిలో మొత్తం కలిపి 1,96,451 మంది మాత్రమే చేరారు. కాగా 2,41,936 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చాకలి ఐలమ్మ వర్సిటీ(Chakali Ailamma University)లో 263 ఖాళీలు ఉండటం గమనార్హం. ఇకపోతే నిజాం కాలేజీలో 205 సీట్లు వేకెంట్ ఉన్నాయి.
Also Read; Teja Sajja: ‘మిరాయ్’లో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.. చూసే వారికి గూస్‌బంప్స్ పక్కా!
రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు
టీఎస్ డబ్ల్యూఆర్డీసీ 28 8080 5183 2897
టీటీ డబ్ల్యూఆర్డీసీ 22 5620 3329 2291
టీబీసీ డబ్ల్యూఆర్డీసీ 29 9914 2745 7169
ఆఫ్ లైన్ కాలేజీలు(మేనేజ్ మెంట్) 58 36866 16182 20684
మొత్తం 967 438387 196451 241936
ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఖాళీల వివరాలు
ఇందిరా ప్రియదర్శిని 486
ప్రభుత్వ డిగ్రీ కాలేజ్(బేగంపేట) 267
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ 265
వీరనారి చాకలి ఐలమ్మ వర్సిటీ 263
ప్రభుత్వ సిటీ కాలేజ్ 261
వివేకానంద డిగ్రీ కాలేజ్ 236
బాబుజగ్జీవన్ రామ్ డిగ్రీ కాలేజ్ 228
ప్రభుత్వ డిగ్రీ కాలేజ్(ఖైరతాబాద్) 225
నిజాం కాలేజ్ 205
ప్రభుత్వ డిగ్రీ కాలేజ్(హుస్సేని ఆలం) 171
ప్రభుత్వ డిగ్రీ కాలేజ్(ఫలక్ నూమా) 133
యూనివర్సిటీ పీజీ కాలేజ్ 118
Also Read: Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?