Ritu Varma
ఎంటర్‌టైన్మెంట్

Ritu Varma: తత్వం బోధపడినట్లుంది.. గ్లామర్ ట్రీట్‌కు రెడీ అంటూ హింట్ ఇచ్చేసిందిగా!

Ritu Varma: రీతూ వర్మ.. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ పేరు బాగానే పరిచయం ఉంది. హీరోయిన్‌గా చేసింది తక్కువ సినిమాలే అయినా, రీతూ వర్మ తనకంటూ ఓ మంచి గుర్తింపును, క్లీన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. కాకపోతే, ఈ మధ్యకాలంలో ఆమెకు సరైన హిట్ మాత్రం పడటం లేదు. దీంతో సినిమా అవకాశాలు కూడా ఆమెకు సన్నగిల్లాయి. ఈ క్రమంలో ఆమె డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఇటీవల ఆమె చేసిన ‘దేవిక అండ్ డ్యానీ’ అనే వెబ్ సిరీస్ మంచి ఆదరణను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమాల పరంగా మాత్రం.. ఆమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు మాత్రం రావడం లేదు. తెలుగమ్మాయి కేటగిరీలో ఆమెను అంతా చూసినా, నటిగా మాత్రం మొదటి నుంచి మంచి అవకాశాలే ఆమెకు వచ్చాయి. దానిని నిలబెట్టుకోవడానికి ఆమె ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీ లేదు.

Also Read- Girls on Married Men: పెళ్లైన మగాళ్లపై అమ్మాయిలు ఎందుకు మోజు పడుతున్నారు? దాని వెనుకున్న కారణాలివే!

పద్ధతిగా ఉంటే సరిపోదు

మరో వైపు ఇతర స్టేట్స్‌ నుంచి వచ్చిన వాళ్లు, టాలీవుడ్‌లో చక్రం తిప్పుతున్నారు. వారికి నటన వచ్చినా, రాకపోయినా.. ప్రేక్షకులు వారిని ఆదరిస్తున్నారు. అందుకు కారణం వారి కున్న గ్లామర్ ఇమేజే అని చెప్పక తప్పదు. రీతూ వర్మ (Ritu Varma) విషయానికి వస్తే.. ఎప్పుడూ పద్ధతిగా కనిపించే పాత్రలే పోషిస్తూ వచ్చింది. నిజంగా అలాంటి పాత్రలతో కూడా ఆమె హీరోయిన్‌గా ఇప్పుడున్న స్థానాన్ని కైవసం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. కానీ ఇది గ్లామర్ ఇండస్ట్రీ. ఇక్కడ కొన్నాళ్ల పాటు నిలబడాలంటే.. పద్ధతిగా ఉంటే సరిపోదు. అప్పుడప్పుడు కాస్త గ్లామర్ రోల్స్‌లో కనిపించాల్సిందే. ఇప్పుడిదే తత్వం ఆమెకు బోధపడినట్లుంది. గ్లామర్ పాత్రలు చేసేందుకు సై అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేసిన ఫొటోలు హింట్ ఇచ్చేస్తున్నాయి.

Also Read- Raghava Lawrence: అప్పుడు కష్టపడిన డబ్బుతో కొన్న ఇంటిని.. లారెన్స్ ఏం చేశాడో తెలుసా?

రీతూ గ్లామర్ ట్రీట్

ఇప్పటి వరకు ఆమె ఎక్కడ కనిపించినా చీర, చుడీదార్, లంగా ఓణీలలో మాత్రమే కనిపిస్తూ వచ్చింది. పబ్లిక్ ఫంక్షన్స్‌లో కూడా ఆమె ఎప్పుడూ పద్ధతి దాట లేదు. కానీ ఆ ఇమేజ్ ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టడం లేదు. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడున్న యంగ్ హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం మానేశారు. అందుకేనేమో.. గ్లామర్ గేట్స్ ఎత్తేసినట్లుగా ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫొటోలను చూసిన వారంతా, రీతూ వర్మ కూడా రెడీ అంటోందా? అనేలా కామెంట్స్ చేస్తున్నారంటే, ఈ ఫొటోల్లో ఉన్న మ్యాటరేందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇప్పటి వరకు రీతూ వర్మను చూసిన వారందరికీ ఆమె షాకిచ్చిందనే చెప్పుకోవాలి. ఆ రేంజ్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చేసింది రీతూ (Ritu Varma Glamour Treat). ఇందులో వైట్‌ షర్ట్ ధరించిన రీతూ వర్మ.. ఇప్పుడున్న కుర్రకారుకు జస్ట్ శాంపిల్ మాత్రమే అనేలా ఈ ఫొటోల్లో రెచ్చిపోయింది. ఇప్పుడీ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRAOU Admissions: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు

Kavitha: టీబీజీకేఎస్ కు గెలిచే సీన్ లేదు… కవిత సంచలన కామెంట్స్!

GHMC – Hydra: హైడ్రాకు కీలక బాధ్యతలు అప్పగించనున్న జీహెచ్ఎంసీ!

Little Hearts: బన్నీ నుంచి చైతూ వరకూ.. ‘లిటిల్ హార్ట్స్’ అందులోనూ టాప్ ప్లేసే!

Tummala Nageswara Rao: రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలి.. అధికారులతో మంత్రి సమీక్ష