Vishnu Manchu: మనోజ్ సినిమాకి అన్న మంచు విష్ణు ట్వీట్
Manchu Vishnu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Vishnu Manchu: తమ్ముడు మనోజ్ సినిమాకి మంచు విష్ణు ట్వీట్

Vishnu Manchu: తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు, లక్ష్మి మంచు, మంచు విష్ణు, మంచు మనోజ్ పెద్ద స్టార్లు సినిమాల్లో ఉన్నారు. అయితే, ఈ మధ్య కాలంలో మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ గొడవలు చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. ఇవి కేవలం చిన్న గొడవలు అనుకుంటే పొరపాటే. ఆస్తి వివాదాలు, కుటుంబ వ్యాపారాలు, వ్యక్తిగత జీవితాలు. అంతే కాకుండా.. మోహన్ బాబు ఇప్పటికే పోలీస్ కంప్లైంట్లు వరకు వెళ్ళాడు. ఈ వివాదం 2023లో పబ్లిక్‌గా మొదలై, 2024-2025లో మరింత తీవ్రమైంది.

ఆస్తి, వ్యాపార విభజన

మోహన్ బాబు వారసత్వం (యూనివర్సిటీ, ప్రొడక్షన్ హౌసెస్, భూములు) విషయంలో అసమానతలు. విష్ణు మోహన్ బాబు యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ను చేపట్టాడు, ఇది మనోజ్‌కు బాధను కలిగించింది. మనోజ్ తన సినిమా “అహం బ్రహ్మాస్మి”కి బడ్జెట్ లేకపోవడం విష్ణు సినిమా “కన్నప్ప”కు 100 కోట్లు ఇవ్వడం వంటి అంశాలు కూడా ప్రధాన కారణాలు. విష్ణు దుబాయ్‌ మారినప్పుడు మనోజ్ తల్లి నిర్మలా మనోజ్‌ను ఇంటికి తీసుకురావాలని ఒత్తిడి చేసింది. కానీ, ఆస్తి విషయంలో గొడవలు జరిగాయి.

పెళ్లి, వ్యక్తిగత డిఫరెన్సెస్

2023 మార్చిలో మనోజ్ భూమా మౌనిక రెడ్డితో రెండో పెళ్లి చేసుకున్నాడు, కానీ మోహన్ బాబు, విష్ణు ఆ పెళ్లిని వ్యతిరేకించారు. మౌనిక, విరానిక (విష్ణు భార్య) మధ్య కలహాలు కూడా ఒక కారణం. అంతే కాదు, మనోజ్ లైఫ్‌స్టైల్ (డ్రింకింగ్ అలవాట్లు) విష్ణు ఐడియాలాజీతో మ్యాచ్ కాకపోవడం మరో కారణం.

విష్ణు, లక్ష్మి మోహన్ బాబు మొదటి భార్య విద్యా దేవి పిల్లలు, మనోజ్ రెండో భార్య నిర్మలా దేవి కుమారుడు. ఇది కొంచెం అసమానతలు కలిగించింది. మోహన్ బాబు విష్ణు ను సపోర్ట్ చేస్తున్నాడు, మనోజ్ ఒంటరిగా పోరాడుతున్నాడు.

మనోజ్ సినిమాకి అన్న మంచు విష్ణు ట్వీట్

తేజ సజ్జా  హీరోగా తెరకెక్కిన సినిమా  మిరాయ్ (Mirai).  తెలుగు  సినీ ఇండస్ట్రీలో ఒక ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ గా మన ముందుకొచ్చింది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన హీరోగా తేజ సజ్జా, మంచు మనోజ్ విలన్ గా నటించారు. రితికా నాయక్, శ్రీయ సరన్, జయరామ్, జగపతి బాబు లాంటి స్టార్ కాస్ట్‌తో వచ్చిన ఈ చిత్రం నేడు రిలీజ్ అయింది. అయితే, ఈ క్రమంలోనే  ” మిరాయ్ కి శుభాకాంక్షలు. మొత్తం బృందానికి దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నాను ”  అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. 

Just In

01

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?