Kishkindhapuri Movie Review: బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన చిత్రం కిష్కింధపురి. హార్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? ఒక్క హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న బెల్లంకొండకి హిట్ ను తీసుకొచ్చిందా లేదనేది రివ్యూలో తెలుసుకుందాం..
సినిమా : కిష్కింధపురి
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, సాండీ మాస్టర్, తణికెళ్ల భరణి, హైపర్ ఆది, సుదర్శన్ తదితరులు
సంగీతం: చేతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: చిన్మయ్ సలస్కార్
ఎడిటర్: నిరంజన్ దేవరమనే
దర్శకుడు: కౌశిక్ పెగళ్లపాటి
నిర్మాత: సాహు గారపాటి
స్టోరీ
రాఘవ్(బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి(అనుపమ పరమేశ్వరన్), మరో వ్యక్తి(సుదర్శన్) కలిసి ఘోస్ట్ వాకింగ్ టూర్స్ అని చేస్తూ ఉంటారు. గ్రూప్‌తో పాత రేడియో స్టేషన్‌కు వెళ్తారు, అక్కడ డార్మెంట్ స్పిరిట్‌ను మేల్కొలిపి, అందరూ ట్రాప్ అవుతారు. దయ్యాలు, వాటి కథల మీద ఇంట్రెస్ట్ ఉన్న కొంతమందిని పాడుబడిన బంగ్లాలకు తీసుకెళ్లి అక్కడ దయ్యాలు ఉన్నట్టు ముందే వీళ్ళే సెటప్ చేసుకొని వీళ్ళతో వచ్చిన వాళ్లందరికీ అక్కడ నిజంగానే దయ్యాలు ఉన్నట్టు నమ్మిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అనుకోకుండా కిష్కింధపురి దగ్గర్లో ఉన్న సువర్ణమయ రేడియో స్టేషన్ కి వీళ్ళు ప్లాన్, ప్రిపరేషన్ లేకుండా వెళ్తారు. అక్కడ వీళ్ళు భయానక శక్తులతో పోరాడుతూ ఎస్కేప్ అవ్వాలి. 1989 బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేసిన ఈ స్టోరీ హారర్, మిస్టరీ, ఎమోషన్స్ మిక్స్. విలన్ బ్యాక్‌స్టోరీ సింపతి కలిగించేలా ఉంటుంది. కానీ క్లైమాక్స్‌లో కొంచెం డైల్యూట్ అవుతుంది. రామాయణ ఎలిమెంట్స్ మెటాఫర్‌గా ఉపయోగించారు.
పాజిటివ్స్
పెర్ఫార్మెన్సెస్: బెల్లంకొండ ఇంటెన్స్, యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. రాక్షసుడు తర్వాత ఇది బెస్ట్ సినిమా అని చెప్పుకోవాలి. అనుపమ హారర్ సీన్స్‌లో డామినేట్ చేసింది, ఎమోషనల్ పార్ట్స్ సూపర్. విలన్ మకరంద్ బ్యాక్‌స్టోరీలో సింపతి కలిగించాడు.
టెక్నికల్ వాల్యూస్: బీజీఎమ్ అద్భుతం, థ్రిల్లింగ్ లాగా అనిపించింది. తెలుగు హర్రర్ లో ఇది బెస్ట్. విజువల్స్, సినిమాటోగ్రఫీ స్టన్నింగ్, హంటెడ్ హౌస్ షూటింగ్ రియల్ ఫీల్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ హారర్ సీన్స్ (స్మశానం, ఇంట్రో) ఎక్సైటింగ్.
స్టోరీ టెల్లింగ్: ఫస్ట్ ఆఫ్ లో మొదటి 10-15 నిమిషాలు స్లో అయినా, తర్వాత ఎడ్జ్-ఆఫ్-సీట్ థ్రిల్. యూనిక్ ప్రెమిస్, ట్విస్ట్‌లు ఆసక్తి పెంచాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ రిఫ్రెషింగ్.
నెగిటివ్స్
1. కథ రొటీన్ హారర్ ఎలిమెంట్స్‌తో మిక్స్ అయింది, కొన్ని సీన్స్ అయితే ప్రెడిక్టబుల్ గా అనిపించాయి.
2. సెకండ్ హాఫ్‌లో పేసింగ్ స్లో, క్లైమాక్స్ VFX ర్యాండమ్‌గా అనిపిస్తుంది.
3. మొదటి 10 నిమిషాలు స్లో, కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉన్నాయి.
రేటింగ్ : 2.5/5