Wednesday, July 3, 2024

Exclusive

National:మోదీజీ.. ఆ రికార్డు అంత ఈజీ కాదు

  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్
  • అత్యధిక స్థానాలలో లీడ్ లో ఉన్న బీజేపీ
  • మూడోసారి ప్రధాని కాబోతున్న మోదీ
  • 16 ఏళ్ల 286 రోజుల పాటు ప్రధానిగా సేవలందించిన నెహ్రూ
  • 15 ఏళ్ల 350 రోజుల పాటు ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీ
  • మోదీ నాలుగవ సారి గెలిస్తేనే ఈ ఇద్దరి రికార్డు అధిగమిస్తారు
  • 10 సంవత్సరాల 8 రోజులు ప్రధాని గా చేసిన మోదీ
  • 10 ఏళ్ల నాలుగు రోజులు ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్

Modi break the record of much more days prime minister after 4th time won:
లోక్ సభ ఎన్నికల ప్రచారం తొలి రెండు దశలలో మోదీ అండ్ కో చెప్పిన ఆబ్ కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్ నినాదాలలో రెండోది మాత్రమే కరక్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎగ్జీట్ పోల్స్ అంచనాలు కూడా ఏవీ 400 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని చెప్పలేదు. ఓవరాల్ గా 340 నుంచి 350 దాకా వస్తాయని చెప్పాయి. అయితే ప్రస్తుత ఓటింగ్ సరళిని బట్టి చూస్తే దాదాపు 300 స్థానాలలో బీజేపీ లీడ్ దశలో ఉండగా ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఓవరాల్ గా మూడో సారి మోదీ వచ్చే సూచన స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మూడో సారి మోదీ ప్రధాని అయినా అది పెద్ద రికార్డ్ కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రికార్డ్‌ను ఎప్పుడో కాంగ్రెస్ దశాబ్దాల ముందే తన ఖాతాలో వేసుకుంది.1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. నాలుగు దశబ్దాలకు ముందు.. యూపీలో 83, బీహార్‌లో 48, మహారాష్ట్రలో 43, గుజరాత్‌లో 24, అలాగే మధ్యప్రదేశ్‌లో 25, రాజస్థాన్‌లో 25, హర్యానాలో 10, ఢిల్లీలో 7, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.

లీడింగ్ స్థానాలలో బీజేపీ

2019లో బీజేపీ 353 స్థానాల్లో గెలిచింది. దీంతో నరేంద్ర మోదీ ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నారు. 2004లో కూడా బీజేపీ, దాని మిత్ర పక్షాల కూటమితో విజయం సాధించింది. అయితే ఇప్పుడు తీస్రీబార్ మోదీ సర్కార్ నినాదం కీలకమైనదిగా మారింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ పార్టీ యుపి (68), బీహార్ (33), మహారాష్ట్ర (29), రాజస్థాన్ (21), మరియు హర్యానా (7), అలాగే మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో క్లీన్ స్వీప్‌ను అందజేస్తుందని చెబుతున్నాయి. ఈ సారి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయనేది సర్వత్రా ఉత్కంఠభరితమైంది. దశలవారీగా జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల సరళిలో బీజేపీ అత్యధిక స్థానాలలో లీడ్ దశలో సాగుతోంది. . దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఉత్కంఠ మంగళవారం మధ్యాహ్నానికే తేలనుంది. కేంద్రంలో మరోసారి గెలిచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా లేక.. ప్రతిపక్ష ఇండియా కూటమి గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన దాదాపు అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నిక అవుతారని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పటికే 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ.. ఈసారి కూడా గెలిస్తే దేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలు అందించిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కుతారా. అసలు అతి ఎక్కువ కాలం భారత ప్రధానిగా పనిచేసిన వారు ఎవరు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

జవహర్ లాల్ నెహ్రూ

దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ మొదటి స్థానంలో ఉన్నారు. భారతదేశం నుంచి బ్రిటీష్ పాలకులు వెళ్లిపోయిన తర్వాత ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు. ఇక 1949 నవంబర్ 26 వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాతి నుంచి.. 1952 లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు జవహర్ లాల్ నెహ్రూ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత స్వాతంత్య్ర భారతదేశంలో జరిగిన మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రిగా గెలిచి తొలి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా గెలుస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే 16 ఏళ్ల 286 రోజుల పాటు ప్రధానమంత్రి హోదాలో దేశానికి సేవలు అందించారు.

ఇందిరా గాంధీ

జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ దేశానికి రెండో ప్రధాని అయ్యారు. నెహ్రూ తర్వాత ఇప్పటికీ అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్న వారి జాబితాలో ఇందిరా గాంధీ రెండో స్థానంలో ఉన్నారు. ఇందిరా గాంధీ మొత్తం 15 ఏళ్ల 350 రోజుల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు.

నరేంద్ర మోదీ

యూపీఏ హయాంలో వరుసగా రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్‌ను దాటేసి.. ప్రధాని మోదీ ఇటీవలె మూడో స్థానంలో నిలిచారు. నరేంద్ర మోదీ 10 ఏళ్ల 8 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుత ఫలితాల సరళి చూస్తే మూడోసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోదీ అవుతారని స్పష్టం అవుతోంది. అయితే ఈ 3 టర్మ్ మొత్తం 5 ఏళ్ల పాటు ప్రధానిగా నరేంద్ర మోదీ కొనసాగినా.. ఇందిరా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూలను దాటేయలేరు. ఎందుకంటే 2029 ఎన్నికల వరకు ప్రధానిగా కొనసాగినా 15 ఏళ్లు దాటుతుంది. అయితే 2029 ఎన్నికల్లో కూడా గెలిచి అధికారంలోకి వస్తే మాత్రం ఈ రికార్డులు చెరిగిపోనున్నాయి.

మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల 4 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ 6 ఏళ్ల 80 రోజులు.. రాజీవ్ గాంధీ 5 ఏళ్ల 32 రోజులు.. పీవీ నరసింహా రావు 4 ఏళ్ల 330 రోజులు.. మొరార్జీ దేశాయ్ 2 ఏళ్ల 126 రోజుల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. లాల్ బహదూర్ శాస్త్రి ఒక ఏడాది 216 రోజులు.. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (వీపీ సింగ్) 343 రోజులు.. హెచ్‌డీ దేవెగౌడ 324 రోజులు, ఐకే గుజ్రాల్ 332 రోజులు, చంద్రశేఖర్ 223 రోజులు, చరణ్ సింగ్ 170 రోజుల పాటు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు.

Publisher : Swetcha Daily

Latest

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Don't miss

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

National: మూడోసారి ప్రధాని కావడం జీర్ణించుకోలేకపోతున్నారు

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ రాహుల్ లా ప్రవర్తించకండంటూ ఎంపీలకు సూచన అధికార, మిత్ర పక్షాల నేతలకు దిశానిర్దేశం మీడియా కామెంట్స్ కు ముందు ఆ సమస్యపై స్టడీ...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...

Hyderabad: విస్తరణకు వేళాయే

ఈ నేల 4న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం గవర్నర్ తో సుదీర్ఘ సమావేశం ...