Ritika Nayak
ఎంటర్‌టైన్మెంట్

Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్

Ritika Nayak: ‘హనుమాన్’ హీరో తేజ సజ్జా నటించిన మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్‌’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ రితికా నాయక్  మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆమె మాట్లాడుతూ..

ఎక్జయిటెడ్‌గా ఉన్నా

‘‘నా తొలి చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ తర్వాత ఒక మంచి పాత్ర కోసం చూస్తున్న సమయంలో నాకు ‘మిరాయ్’ అవకాశం వచ్చింది. చాలా అద్భుతమైన కథ ఇది. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం చాలా ఎక్జయిటెడ్‌గా ఉన్నాను. అందరం చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా ఇది. ఫైనల్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో చాలా స్ట్రాంగ్ పాత్ర చేశాను. హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్ నాది. గ్రేట్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా నా పాత్ర గురించి అప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు. ఈ యాక్షన్ అడ్వంచర్ ఆడియన్స్‌కు గొప్ప అనుభూతిని ఇస్తుంది.

Also Read- Mega Little Prince: మెగా లిటిల్ ప్రిన్స్‌.. రామ్ చరణ్, నిహారిక పోస్ట్‌లు వైరల్..!

చాలా నేర్చుకున్నా..

తేజ సజ్జా చాలా ప్రొఫెషనల్ యాక్టర్. వెరీ స్వీట్ పర్సన్. ప్రతి సన్నివేశానికి చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్‌లో అతనికి చాలా గాయాలు అయ్యాయి. కొన్ని సార్లు హెల్త్ బాగోనప్పటికీ ఆయన కరెక్ట్ టైమ్‌కి సెట్ లో ఉండేవారు. ఈ సినిమా జర్నీలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మనోజ్ చాలా పవర్ఫుల్లో పాత్రలో కనిపిస్తారు. ఆఫ్ స్క్రీన్ ఆయన ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. చాలా స్వీట్ పర్సన్. ఇంకా ఈ సినిమాలో జగపతిబాబు, శ్రియా వంటి వారందరిలో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

Also Read- Allu Arjun- Atlee: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌‌కు గుడ్ న్యూస్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అట్లీ

విజన్ ఉన్న డైరెక్టర్

ఈ సినిమాను దాదాపు 80 శాతం లైవ్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. కొన్ని చాలెంజింగ్ మూమెంట్స్ ఉన్నాయి. టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్‌తోనే ఈ జర్నీ చాలా అద్భుతంగా జరిగింది. దర్శకుడు కార్తీక్ చాలా విజన్ ఉన్న డైరెక్టర్. ఆయన సెట్‌లో చాలా క్లారిటీగా ఉంటారు. ‘మిరాయ్’ని ఒక అద్భుతంగా రెడీ చేశారు. మా ఇద్దరి బర్త్ డేస్‌కి మధ్య ఒక్క రోజే గ్యాప్. సెట్‌లో మమ్మల్ని బ్రదర్ సిస్టర్ అని పిలిచే వాళ్ళు. నాకు సూపర్ హీరో మూవీస్ అంటే చాలా ఇష్టం. ‘హనుమాన్’ నాకు చాలా ఇష్టమైన సినిమా. యాక్షన్, రొమాన్స్ నా ఫేవరెట్ జోనర్స్. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఫిదా చూసి నిజంగానే ఫిదా అయిపోయా. తనే నా ఇన్స్పిరేషన్. ఈ చిత్ర నిర్మాతల గురించి చెప్పాలి. చాలా ప్యాషన్ ఉన్న నిర్మాతలు. ఇలాంటి ప్రొడక్షన్ హౌస్‌లో వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్ గా తీశారు. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్‌ కూడా సైన్ చేశాను. త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేస్తారు’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

The Raja Saab: ‘కాంతార చాప్టర్ 1’కు, ‘ది రాజా సాబ్’కు ఉన్న లింకేంటి? నిర్మాత ఏం చెప్పారంటే?

Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్

Mega Little Prince: మెగా లిటిల్ ప్రిన్స్‌.. రామ్ చరణ్, నిహారిక పోస్ట్‌లు వైరల్..!

Bellamkonda Sai Sreenivas: ‘కిష్కింధపురి’ చూశాను.. మైండ్ బ్లోయింగ్.. బెస్ట్ ఏంటంటే?

OG Movie: రికార్డ్స్ రాకుండా చేస్తున్నారంటూ.. ‘ఓజీ’ అమెరికా డిస్ట్రిబ్యూటర్లపై ఫ్యాన్స్ ఆగ్రహం!