Koonamneni Sambasiva Rao: రాష్ట్ర వ్యాపితంగా ఈ నెల 11 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Koonamneni Sambasiva Rao) పార్టీ కేడర్ కు పిలుపు నిచ్చారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11 నుంచి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న మఖ్దూం మొహినోయుద్దీన్ విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఎర్ర చొక్కాలు, ఎర్ర చీరలతో పురుషులు, మహిళా ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాపితంగా ఆయా జిల్లాలలోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కేంద్రాల్లో జరుగుతాయని, ఈ ఉత్సవాలకు రాష్ట్ర, జిల్లా నాయకత్వం పాల్గొననున్నదని తెలిపారు.
Also Read: CM Chandrababu: కొత్త పథకం ప్రకటించిన చంద్రబాబు.. దసరా నుంచే అమలు.. ఖాతాల్లోకి రూ.15 వేలు!
చరిత్ర లేని బీజేపీ దుష్ప్రాచారం
ఈనెల 17న ముగింపు ఉత్సవాలను హైదరాబాద్‌లోని రావి నారాయణ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర, చరిత్ర లేని బీజేపీ దుష్ప్రాచారం చేస్తున్నదని, పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న దుష్టపన్నాగాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాపితంగా పార్టీ శ్రేణులు సాధ్యమైన చోట్ల సభలు, సదస్సులు, సెమినార్లు పార్టీ నిర్వహిస్తున్నదని వెల్లడించారు.
మహత్తర పోరాటం ప్రపంచ చరిత్రలోనే విశిష్టమైనది
నిజాం రాచరిక, భూస్వామ్య వ్యవస్థల కబంద హస్తాల నుంచి విముక్తి కల్పించేందుకు నాడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో మట్టి మనుషులు చేసిన మహత్తర పోరాటం ప్రపంచ చరిత్రలోనే విశిష్టమైనదన్నారు. ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ మాతృభూమి స్వాతంత్య్రం కోసం అసవులు బాసారాని గుర్తు చేశారు. వారోత్సవాల సందర్భంగా నాటి ఘన చరిత్రను మననం చేసుకోని స్ఫూర్తి పొందడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు.
Also Read: Mirai Train Stunt: ‘మిరాయ్’ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని హీరో.. ఏం చేశాడో తెలుసా?