Day Care Centers: క్యాన్సర్ నియంత్రణపై సర్కార్ ఫోకస్ పెట్టిందని మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్(General Hospitals)లో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ డే కేర్ కేన్సర్ సెంటర్ల(District Day Care Cancer Centers)ను ఆయన సంగారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి వర్చువల్ మోడ్ లో ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కేన్సర్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయన్నారు. మన రాష్ట్రంలో ఏటా 55 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయన్నారు.
నోరి దత్తాత్రేయుడు సలహాలు
మరో ఐదేండ్ల తర్వాత ఏటా 65 వేలకుపైగా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో కేన్సర్ నివారణ(Cancer prevention), ఎర్లీ డయాగ్నసిస్(Early Diagnosis),పేషెంట్లకు చికిత్స అందించే అంశాలపై దృష్టి పెట్టామన్నారు. ప్రముఖ అంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు(Nori Dattatreya) సలహాలు తీసుకుని ముందుకెళ్తున్నామన్నారు. ప్రస్తుతం ఎంఎన్‌జే, నిమ్స్‌లో కేన్సర్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామన్నారు. కానీ, పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ హాస్పిటళ్లపై లోడ్ పెరుగుతుందన్నారు. మరోవైపు పేషెంట్లకు హైదరాబాద్ వరకూ వచ్చి చికిత్స తీసుకోవడం భారంగా మారిందని, ఈ నేపథ్యంలో ఎక్కడి వారికి అక్కడే చికిత్స అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
Also Read: Mirai Movie: ‘మిరాయ్’ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్.. దానిని తగ్గించడానికి ఏం చేశారంటే?
కీమో థెరఫీ పేషెంట్లు
అందుకోసమే ప్రతి జిల్లాలో డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం 34 సెంటర్లను ప్రారంభించామని, ఈ సెంటర్లలో కేన్సర్ స్క్రీనింగ్, డయాగ్నసిస్(Diagnosis), కీమో థెరపీ(Chemotherapy), పాలియేటివ్ కేర్(Palliative Care) వంటి చికిత్సలన్నీ అందిస్తామన్నారు. కీమో థెరఫీ అవసరమైన పేషెంట్లు ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఇంటికి వెళ్లవచ్చన్నారు. ఎంన్ జే(NJ), నిమ్స్(NIMS) నుంచి సీనియర్ డాక్టర్లు సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. 2030 కల్లా జిల్లాల్లోనే పూర్తి స్థాయి క్యాన్సర్ చికిత్స అందించేలా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రీజనల్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ)Christina Chongtu), డీఎంఈ డాక్టర్ నరేందర్ కుమార్(Nrende Kumar) తదితరులు ఉన్నారు.
Also Read: Raj Kundra Fraud: చీటింగ్ కేసులో రాజ్ కుంద్రాకు పోలీసులు సమన్లు.. అయినా అవేం పనులు