Daksha Movie: మంచు లక్ష్మి ‘దక్ష’ ట్రైలర్‌పై ఐకాన్ స్టార్ ప్రశంసలు
daksha( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Daksha Movie: మంచు లక్ష్మి ‘దక్ష’ ట్రైలర్‌పై ఐకాన్ స్టార్ ప్రశంసలు..  ఏం యాక్షన్ గురూ.. 

Daksha Movie: మంచు లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఇందులో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఇందులో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రసంశల వర్షం కురిపించారు.

Read also-Illegal Belt Shops: మద్యం బాటిల్ పై స్టిక్కర్ దందా.. వైన్స్ యజమానులే అధికారులా?

ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ట్వీట్‌లో.. ‘‘నా మిత్రురాలు, ఆప్తురాలైన లక్ష్మీ మంచుకి, ఆమె తదుపరి చిత్రం దక్ష (Daksha)కు శుభాకాంక్షలు. మీకు ఆత్మీయమైన నా ప్రేమను తెలియజేస్తున్నాను. మీరు, మోహన్ బాబు గారు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శకుడు వంశీ కృష్ణ మల్లా @itsMVKrishna చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మంచు లక్ష్మి కనిపించబోతున్నారు. యాక్షన్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కూడా ఉన్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

Read also-Bellamkonda Sai Srinivas: వారి వల్లే సినిమాకు అలా జరిగింది.. అలా అనే సరికి బాధేస్తోంది

ఈ సందర్భంగా దర్శకుడు వంశీ కృష్ణ మల్లా మాట్లాడుతూ.. ‘‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్‌కు థ్యాంక్స్. ఆయనకు ట్రైలర్ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ సో మచ్ సార్. దుబాయ్‌లో జరిగిన ‘సైమా-2025’ వేడుకల్లోనూ ట్రైలర్‌ను ప్రదర్శించగా, అక్కడ కూడా అందరికీ నచ్చింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచు లక్ష్మిగారు ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్రని ఇందులో చేశారు. అలాగే మోహన్ బాబుగారిని, మంచు లక్ష్మిగారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను..’’ అని అన్నారు.

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం