Mahesh Babu: వారికి వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు..
NAMRATA( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mahesh Babu: వారికి వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు.. యూఎస్‌లో ప్రత్యక్షమైన నమ్రత

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రాబోతున్న భారీ బడ్జెట్ గ్లోబల్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం SSMB29. ఇది లార్డ్ హనుమాన్ నుంచి స్ఫూర్తి పొందిన కథతో దాదాపు 1200 కోట్ల రూపాయల అంచనా రూపొందుతున్న సినిమా. ఈ చిత్రంలో హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్ పాత్రలో నటిస్తుండగా, ఇండియానా జోన్స్, టింటిన్ తరహా గ్లోబ్‌ట్రాటింగ్ క్వెస్ట్ స్టోరీని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కెన్యాలోని నైరోబీ, నేషనల్ పార్కులు, మౌంట్ కిలిమంజారో వంటి లొకేషన్లలో 10 రోజుల షెడ్యూల్‌లో యాక్షన్, ట్రావెల్ సీక్వెన్స్‌లు చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్స్ టాన్జానియా, సౌత్ ఆఫ్రికాలో జరిగే అవకాశం ఉంది.

Read also-Kalyani Priyadarshan: ‘కొత్త లోక’ విడుదలకు ముందు దుల్కర్ సల్మాన్ కల్యాణీకి ఏం చెప్పాడంటే.. అందుకేనా ఆ కలెక్షన్స్

అయితే తాజాగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ అమెరికలోని యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అక్కడ కొంత మంది ఆకతాయిలు గౌతమ్ ను ర్యాగింగ్ చేశారని సమాచారం. ఇది తెలుసుకున్న మహేష్ అక్కడి సిబ్బందిపై సీరియస్ అయ్యి, వారికి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. వెంటనే నమ్రతకు కాల్ చేసి యూఎస్ వెళ్లి గౌతమ్ ను ఓదార్చాలని తెలిపారట. అందుకే నమ్రత అమెరికా వెళ్ళారని సినీవర్గాలు చెబుతున్నాయి. దీని కోసం మహేష్ బాబు షూటింగ్ ను సైతం వదిలి ఫ్యామిలీ కోసం ఇంటికి బయలుదేరాడని తెలుస్తోంది. అయితే యూఎస్ వెళ్లిన నమ్రత మాత్రం తన పిల్లలతో కలిసి ‘యూఎస్ ఓపెన్’ చూడటానికి వెళ్లామంటూ పోస్త్ పెట్టారు. దీంతో ఈ విషయం గందరగోళంగా మారింది. ఈ వివాదం గురించి మాత్రం ఎక్కడా అధికారికంగా తెలియలేదు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

Read also-Anuparna Roy: వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చరిత్ర సృష్టించిన దర్శకురాలు.. ఇది కదా కావాల్సింది

మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీలో తన రోల్ కోసం స్పెషల్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇందులో ఆయన అడ్వెంచరస్ లుక్‌లో కనిపిస్తారు. ఎస్.ఎస్.ఆర్ మూవీస్, ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. ఈ సినిమాని లీకేజీల భూతం పట్టి పీడిస్తోంది. దీనిని నివారించడానికి మూవీ టీం గట్టి సెక్యూరిటీ చర్యలు తీసుకుంటోంది. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌గా నిలవనుంది. దీనిని భారత దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా చేయడం, రాజమౌళి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.  అయితే రాజమౌళి మాత్రం ఈ సినిమా గురించి ఒక్క అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా నుంచి ఓ పోస్టర్ ను విడుదల చేశరు. దీంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా అధికారిక వివరాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Just In

01

VV Vinayak: ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌‌’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?

Jio New Year offers: హ్యాపీ న్యూఇయర్ ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో

Social Media Ban: ఆస్ట్రేలియా తర్వాత 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం విధించనున్న మరో దేశం

Panchayat Results: రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Missterious: సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న “మిస్టీరియస్”