Dancer ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Shrasti Verma: శ్రష్ఠి వర్మ టార్గెట్ అతడేనా.. బిగ్ బాస్ హౌస్‌లో ఆ నిజాలన్నీ బయటపెడుతుందా?

Shrasti Verma: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో ఎన్నో ఊహించని ట్విస్ట్‌లు, సరికొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఒక ప్రముఖ కంటెస్టెంట్‌గా లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) హౌస్‌లోకి అడుగుపెట్టింది. తన అద్భుతమైన నృత్య కళాత్మకత, డైనమిక్ వ్యక్తిత్వంతో ఇప్పటికే శ్రష్టి ఈ షోలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది.

Also Read: Kalyani Priyadarshan: ‘కొత్త లోక’ విడుదలకు ముందు దుల్కర్ సల్మాన్ కల్యాణీకి ఏం చెప్పాడంటే.. అందుకేనా ఆ కలెక్షన్స్

శ్రష్ఠి వర్మ కప్పు కొడుతుందా? 

శ్రష్టి వర్మ తెలుగు బుల్లితెర, సినీ రంగంలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన యంగ్ డ్యాన్సర్. ఆమె తన సినీ కెరీర్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ప్రారంభించింది. జానీ మాస్టర్ వంటి అగ్రశ్రేణి కొరియోగ్రాఫర్‌తో పనిచేసిన అనుభవం ఆమెకు నృత్య రంగంలో బలమైన పునాదిని వేసింది. ఈ అనుభవం ఆమెకు సినిమా, టెలివిజన్ రంగాలలో తన సొంత గుర్తింపును సృష్టించుకునేందుకు దోహదపడింది. శ్రష్టి వర్మ బుల్లితెరపై బాగా పాపులర్ అయిన “ఢీ” డ్యాన్స్ షో ద్వారా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈ షోలో ఆమె ప్రదర్శించిన డ్యాన్స్, కొత్త ఆలోచనలతో కూడిన కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ షో ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టడమే కాకుండా, ఆమె నృత్య కళాత్మకతను వెల్లడించే వేదికగా నిలిచింది.

Also Read: Khammam District: ఆశ్రమ స్కూల్లో హెడ్ మాస్టర్ ఇష్టా రాజ్యం.. ఉద్యోగం ఒకరిది విధుల్లో మరొకరు.. ఎక్కడంటే.?

శ్రేష్ఠ వర్మ, జానీ మాస్టర్‌ వివాదం? 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఐదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన శ్రేష్ఠ వర్మ. తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమె జానీ మాస్టర్‌తో కలిసి ‘జైలర్’, ‘పుష్ప’, ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు సహాయ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. అయితే, శ్రేష్ఠ వర్మ, జానీ మాస్టర్‌ల మధ్య వివాదం గత ఏడాది (2024)లో లైంగిక వేధింపుల ఆరోపణలతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ లో మళ్లీ అతడి గురించి ఎత్తుతుందా? లేదనేది చూడాల్సి ఉంది. తనను తాను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం అనుకుని , బిగ్ బాస్ లోకి వెళ్ళానని స్టేజ్ మీద చెప్పింది.

Also Read: Khammam District: ఆశ్రమ స్కూల్లో హెడ్ మాస్టర్ ఇష్టా రాజ్యం.. ఉద్యోగం ఒకరిది విధుల్లో మరొకరు.. ఎక్కడంటే.?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!