Saiyaara OTT
ఎంటర్‌టైన్మెంట్

Saiyaara OTT: రూ. 600 కోట్లు కొల్లగొట్టిన సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?

Saiyaara OTT: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అనుకునేవారు. అలాంటి రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ వంటి దర్శకులు.. అది తప్పని నిరూపించారు, నిరూపిస్తూనే ఉన్నారు. బాలీవుడ్‌కి కూడా ఇండియన్ సినిమా అంటే.. భారతదేశంలో ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీలు అని.. ఈ మధ్యే అర్థమైంది. ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందంటే.. ఏడాదికి కేవలం రెండు, లేదంటే మూడు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చిత్రాలుగా నిలుస్తున్నాయి. బాలీవుడ్ బడా హీరోల చిత్రాలను కూడా అక్కడి ప్రేక్షకులు తిప్పికొడుతున్నారు. అదే సమయంలో, సౌత్ నుంచి వస్తున్న చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో బాలీవుడ్ పరిస్థితి రోజురోజుకూ డౌన్ అవుతున్న సమయంలో.. సౌత్ సినీ ఇండస్ట్రీని అక్కడి స్టార్స్ గుర్తించడం మొదలు పెట్టారు. సౌత్‌కి చెందిన దర్శకులతో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. అలా మళ్లీ ఊపిరి పోసుకుంటున్న బాలీవుడ్‌కు.. తాజాగా ‘సైయారా’ (Saiyaara) రూపంలో మంచి సక్సెస్ లభించింది.

Also Read- Manoj Manchu: డూప్స్ లేకుండా రియల్ స్టంట్స్.. మంచు మనోజ్‌పై ఫైట్ మాస్టర్ కామెంట్స్

రూ. 50 కోట్ల బడ్జెట్.. రూ. 600 కోట్ల కలెక్షన్స్

వాస్తవానికి ‘ఛావా’ తర్వాత బాలీవుడ్‌కు సరైన హిట్ లేదనే చెప్పుకోవాలి. మళ్లీ ‘సైయారా’నే బాలీవుడ్ పరువును నిలబెట్టింది. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. దాదాపు రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి.. బాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచింది. ఇంకా థియేటర్లలో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గానే కొనసాగుతోంది. ఈ సినిమా తర్వాత వచ్చిన చాలా సినిమాలు, బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయ్. మరీ ముఖ్యంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మించిన ‘వార్ 2’ (War 2) సినిమా ఎన్నో అంచనాలతో వచ్చి, భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ యాక్షన్ ఫిల్మ్ కంటే.. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ‘సైయారా’కే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ‘సైయారా’ సినిమా ఇప్పుడు ఓటీటీలో (Saiyaara OTT) మెరుపులు మెరిపించేందుకు రాబోతోంది.

Also Read- Bandla Ganesh: దున్నేయ్.. ఇక టాలీవుడ్ నీదే.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి బండ్ల బూస్ట్!

సైయారా స్ట్రీమింగ్ డేట్..

అహాన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా ‘సైయారా’ చిత్రం సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. కొరియన్ మూవీ ‘ఏ మూమెంట్ టూ రిమెంబర్’ ఆధారంగా దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాను తెరకెక్కించారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించడం. ప్యూర్ ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘సైయారా’ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణను రాబట్టుకుంటుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 12 వరకు వెయిట్ చేయాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Krishna Mohan Reddy: గద్వాలలో వేడెక్కిన రాజకీయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేకు అగ్నిపరీక్షే!

Red Sea cable cut: ఎర్ర సముద్రంలో కేబుల్స్ కటింగ్.. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం!

Trisha: విజయ్ పొలిటికల్ పార్టీపై త్రిష ఆసక్తికర కామెంట్స్.. ఏదో తేడాగా ఉందేంటి?

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నుంచి ‘పప్పీషేమ్’ ఫుల్ సాంగ్ ఇదే.. ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు..

Chicken Dosa Video: చికెన్ దోశ కోసం.. రెండుగా చీలిన సోషల్ మీడియా.. నెట్టింట ఒకటే రచ్చ!