Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మాతగా చేసిన మొదటి సినిమాతోనే రికార్డ్స్ సృష్టించడం కాదు.. ఒక హిస్టరీనే క్రియేట్ చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్త నిర్వాహణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu). 9 ఆగస్ట్, 2024న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, కలెక్షన్ల పరంగానూ బిగ్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ఇక ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదులే అని అంతా అనుకున్నారు. కానీ, ఓటీటీలో విడుదలై అక్కడా మంచి ఆదరణనే రాబట్టుకుందీ చిత్రం. ఇక అక్కడి నుంచే ఈ సినిమా అసలు సిసలు జైత్రయాత్ర మొదలైంది. ఏ అవార్డులు ప్రకటించినా, అందులో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఉంటూనే ఉంది. నటిగా, నిర్మాతగా నిహారిక కొణిదెల ఈ చిత్రంతో అవార్డులు, రివార్డులు అందుకుంటూనే ఉంది.
Also Read- SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్
గద్దర్ అవార్డ్స్ టు సైమా
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా సత్తా చాటిన విషయం తెలిసిందే. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా, దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడిగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు (Gaddar Telangana Film Awards) వచ్చాయి. రీసెంట్‌గా దుబాయ్‌లో జరిగిన గామా (GAMA) అవార్డుల్లోనూ ‘కమిటీ కుర్రోళ్లు’ సత్తా చాటింది. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా యదు వంశీకి గామా అవార్డులు వరించాయి. తాజాగా జరిగిన ‘సైమా 2025’ (SIIMA 2025) వేడుకలలోనూ ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా రెండు అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా సందీప్ సరోజ్‌కి సైమా అవార్డు వచ్చింది. దీంతో ఈ చిత్రం మరోసారి వార్తల్లో హైలెట్ అవుతోంది.
Also Read- Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!
హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక
వాస్తవానికి నిహారిక హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణించాలని అనుకుంది కానీ, అది జరగలేదు. దీంతో ఆమె నిర్మాతగా మారి చేసిన తొలి ఫీచర్ ఫిల్మ్‌తోనే టాలీవుడ్‌లో ఓ హిస్టరీని క్రియేట్ చేసింది. ఈ మూవీకి యదు వంశీ డైరెక్టర్‌గా, రాజు సినిమాటోగ్రఫర్‌గా, అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. మన్యం రమేష్ ప్రొడక్షన్ వ్యవహరాల్ని చూసుకున్నారు. థియేటర్లలో కమర్షియల్‌గా మంచి సక్సెస్ అందుకున్న ఈ చిత్రం రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, థియేట్రికల్‌గా రూ. 18.5 కోట్లు వసూళ్లను రాబట్టింది. అలాగే నాన్ థియేట్రికల్‌గా రూ. 6 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా రూ. 24.5 కోట్ల వసూళ్లను సాధించి, చిన్న చిత్రాల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీకి గుర్తింపు వస్తుండటంతో నిహారిక అండ్ టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం తన బ్యానర్‌లో రెండో చిత్రాన్ని ఇటీవలే ప్రకటించింది నిహారిక. సంతోష్ శోభన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు