Harish Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Harish Rao: పాలకులే ఈరోజు నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) ప్రశ్నించారు. హైడ్రా(Hydraa)తో హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలిందని విమర్శించారు. ఎన్నారైలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. లండన్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ పార్టీ మొదట పుట్టిందే లండన్ లో అని, యూకే ఎన్నారైల వల్లే ప్రపంచవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వ్యాప్తి చెందిందన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, బతుకమ్మ లాంటి పండుగలను ప్రపంచానికి చాటి చెప్పింది కూడా ఇక్కడి నుంచే అన్నారు.

నాడు బెంగాల్..

తెలంగాణ ఉద్యమంలో మేము నిరసన కార్యక్రమాలు, ఉద్యమాన్ని చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని ఈ గడ్డపై కూడా చేసింది మీరేనన్నారు. కేసీఆర్(KCR) కి మద్దతిచ్చి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మీ అందరికీ తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలంటూ తెలిపారు. కేసీఆర్(KCR) నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించిందన్నారు. నాడు బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని ఉండేదని, కానీ కేసీఆర్ పాలనతో తెలంగాణ(Telangana) ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని కాడికి తెచ్చామన్నారు. గత 10 ఏండ్లలో గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుందని, పర్ క్యాపిటా ఇన్కమ్ లో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. జీఎస్డీపీ(GSDP) గ్రోత్ లో తెలంగాణ రాష్ట్రానికి దరిదాపులో కూడా ఏ రాష్ట్రం లేదన్నారు.

Also Read: CM Revanth Reddy: ఆయనకు ప్రత్యామ్నాయం ఎవరు లేరు.. నాటి కృషే నేటి ఫలితం

 తెలంగాణలో ఎక్కడ కూడా..

కేసీఆర్ డెడికేషన్ గా పనిచేసేవారని, ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వెల్లడించారు. రైతుల కోసం దేశంలోనే నేరుగా నగదు బదిలీ చేసిన ఒకే ఒక కార్యక్రమం రైతుబంధు అన్నారు. 2014కి ముందు ఎక్కడ చూసినా రెండు మూడు లక్షలకు మించి ఎకరం ఉండేది కాదని, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కూడా 30 నుండి 50 లక్షల ఎకరం తక్కువ లేదన్నారు. విద్యుత్ వినియోగమైనారోడ్ ట్రాన్స్పోర్ట్ అయినా, ఏ కార్యక్రమమైనా తెలంగాణ దేశానికి ఆదర్శంఅన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు 10 లక్షలు తక్కువకు అమ్ముదామంటే ఎవరూ కొనేవాళ్లు లేకుండా పోయిందని, ఒక పాజిటివ్ ఆటిట్యూడ్ లేకపోవడమే కారణమన్నారు.

తెలంగాణలో అవినీతి పెరిగిందని, ఏ శాఖలో చూసిన అవినీతి మయం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కాళేశ్వరం(Kaleshwaram) అంటే లక్ష లక్ష కోట్ల రూపాయలు పోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ(NDSA) రిపోర్ట్ అంటారు. బ్లాక్ సెవెన్ ఒకటి రిప్లై చేసి కట్లే సరిపోతుందని చెప్పిందని ఆ రిపోర్టులో పేర్కొన్నారన్నారు. మూడు నాలుగు వందల కోట్లలో మేడిగడ్డ రిపేర్ అయిపోతుందని, కానీ లక్ష కోట్లు అని దుష్ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు రైతుల ప్రయోజనాలు దెబ్బతినే విధంగా రాజకీయాలు చేయకూడదని సూచించారు.

Also Read: CM Revanth Reddy: పాలమూరు జిల్లాలో విద్య వైద్యం సాగు నీటి ప్రాజెక్టులు పూర్తికి ప్రాధాన్యం.. సీఎం రేవంత్ రెడ్డి

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..