little hearts (Image Source : Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Little Hearts Movie Review: లిటిల్ హార్ట్స్ సినిమా రివ్యూ.. కుర్ర హీరో హిట్ కొట్టాడా?

Little Hearts Movie Review:  ‘లిటిల్ హార్ట్స్’ ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ, దీనిని సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, యూట్యూబర్ మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, శివాని నాగారం హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఈటీవీ విన్ బ్యానర్‌లో ఆదిత్య హసన్ నిర్మాణంలో సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజ్ అయింది. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హసన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ యూత్‌ని ఆకట్టుకుందా? లేదా అనేది చూద్దాం..

ప్లస్ పాయింట్స్:

హాస్యం: ఈ చిత్రం యూత్‌ని లక్ష్యంగా చేసుకుని రూపొందింది. ఫేస్‌బుక్ ఎరా, ఎంపీసీ vs బైపీసీ విద్యార్థుల గొడవలు, కోచింగ్ సెంటర్ జీవితం వంటి అంశాలు 2000ల కాలాన్ని గుర్తుచేస్తాయి. మౌళి, జయకృష్ణల కామెడీ సీన్లు, ముఖ్యంగా హీరో హీరోయిన్ కోసం సాంగ్ వీడియో తీసే ఎపిసోడ్ బాగా నవ్విస్తుంది.

నటన: మౌళి తన యూట్యూబ్ ఛార్మ్‌ని వెండితెరపై కొనసాగించాడు. కామెడీ, ప్రేమ సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. శివాని నాగారం కాత్యాయనిగా సహజంగా కనిపించి, అమ్మాయి పాత్రకు న్యాయం చేసింది. రాజీవ్ కనకాల, ఎస్‌ఎస్ కాంచి, సత్య కృష్ణన్ వంటి సహాయ నటులు తమ పాత్రల్లో బాగా నటించారు.

సంగీతం: సింజిత్ యెర్రమల్లి సంగీతం, ముఖ్యంగా ‘కాత్యాయని’ పాట సినిమాకి పెద్ద ఆకర్షణగా నిలిచింది.

మైనస్ పాయింట్స్

కథలో కొత్తదనం లేకపోవడం: ‘లిటిల్ హార్ట్స్’ కథలో పెద్దగా కొత్తదనం లేదు. ఇంటర్, డిగ్రీ విద్యార్థుల ప్రేమ కథలు, కుటుంబ విభేదాలు వంటివి గతంలో ‘జాతి రత్నాలు’, ‘మ్యాడ్’ వంటి చిత్రాల్లో చూసినవే. ఒక చిన్న ట్విస్ట్ (హీరోయిన్ హీరో కంటే మూడేళ్లు పెద్దది) తప్ప, కథలో లోతైన డ్రామా లేదు.

సెకండాఫ్ : ఫస్ట్ హాఫ్ ఫన్‌తో సాగినా, సెకండ్ హాఫ్‌లో కథ సాగదీయడం, కొన్ని రిపీటెడ్ జోక్స్ మైనస్ గా నిలిచింది. ఎడిటింగ్‌లో మరింత క్రిస్ప్‌నెస్ ఉంటే బాగుండేది.

క్లైమాక్స్: క్లైమాక్స్ లో కొత్త దనం లేదు. కథను ముగించే తీరు సంతృప్తికరంగా లేదు.

సాంకేతిక అంశాలు:

దర్శకత్వం: సాయి మార్తాండ్ సింపుల్ కథను హాస్యంతో అందంగా తెరకెక్కించాడు, కానీ కొత్తగా చెప్పడానికి ఏమీ లేకపోవడం ఒక లోపం.

ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో బాగున్నా, సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ అనిపిస్తుంది.

ప్రొడక్షన్ విలువ్స్: ఈటీవీ విన్ నిర్మాణ విలువ్స్ చిన్న బడ్జెట్ సినిమాకి తగ్గట్టు డీసెంట్‌గా ఉన్నాయి.

సినిమాటోగ్రఫీ: సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ, విజువల్ రిచ్‌నెస్‌తో కళ్లకు ఆనందాన్ని ఇస్తుంది. కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్ కూడా యూత్‌ఫుల్ వైబ్‌ని పెంచాయి.

రేటింగ్: 2.75/ 5

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?