Tummala Nageswara Rao: రైతులకు పంటల సాగు, తెగుళ్లపై సమాచారం అందజేసేందుకు వ్యవసాయశాఖ వాట్సాప్ ఛానెల్(WhatsApp channel) ను ప్రారంభించింది. తొలిసారి శాఖ వాట్సాప్ తో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తుంది. ప్రతి రోజూ పంటలతో పాటు వాటిని జంతువుల నుంచి కాపాడుకోవానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తుంది. అంతేగాకుండా గ్రూప్ డిస్కషన్ కోసం జూమ్ సమావేశాలను నిర్వహిస్తున్న సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కార మార్గం చూపుతుంది.
సులువుగా రైతాంగానికి సమాచారం
ప్రతి ఒక్కరికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, మొబైల్ తో ప్రతి నిత్యం సమాచారం తెలుసుకుంటున్నారు. దీంతో రైతులకు అందుబాటులోకి వ్యవసాయశాఖ చేపడుతున్న కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సప్ ఛానెల్ ను తీసుకొచ్చింది. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ తెలంగాణ పేరుతో వ్యవసాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఛానెల్ తోఎప్పటికప్పుడు తెలంగాణ రైతాంగానికి కీలకమైన సమచారం, సలహాలు, సూచనలను వ్యవసాయ శాఖ అందిస్తోంది. ప్రధానంగా వాతావరణ హెచ్చరికలు, పంటల వివరాలు, పురుగు మందులు, ఎరువుల వివరాలు అన్ని వాట్సాప్ ఛానల్ ద్వారా సులువుగా రైతాంగానికి సమాచారం తెలియజేస్తున్నారు. అంతేకాదు వాట్సాప్ ఛానెల్ ఎలా వినియోగించుకోవాలి అనే విషయాన్ని తెలియజేడానికి ఏఐ వీడియోను కూడా క్రియేట్ చేసి షేర్ చేశారు. రైతులకు సాగు చేస్తున్న ఆయా పంటలకు తెగుళ్లు పడితే.. ఎలాంటి మందులు చల్లాలి, ఏం చేయ్యాలి అనే విషయాలన్నీ వివరణాత్మకంగా వాట్సాప్ చానల్ ద్వారా వ్యవసాయ శాఖ సమాచారం ఇస్తుంది.
Also Read: Jogulamba Gadwal Accident: వినాయక నిమజ్జనంలో అపశృతి.. ట్రాక్టర్ ను డీసీఎం వ్యాన్ ఢీ?
వ్యవసాయానికి సంబందించి క్విప్ పోటీలు
రాష్ట్రంలో ప్రధాన పంటగా ఉన్న వరిలో పాముపొడ తెగులు, ఆకు ముడత నివారణ కోసం శాస్త్రవేత్తల సూచనల మేరకు చేపట్టాల్సిన చర్యలు వివరంగా షేర్ చేసింది. ఇక కంది, మొక్కజోన్నలో కాండం తొలుచు పురుగు కోసం వాడాల్సిన పురుగు మందులు, పత్తిలో జింక్ లోపం సవరణ, పచ్చదోమ నివారణ వంటి వాటికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఉద్యాన వన పంటల విషయంలో సవాళ్లు, సమస్యలు ఎదురైతే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ఈ వాట్సప్ చానల్ తో సమాచారాన్ని వ్యవసాయ శాఖ అందిస్తుంది. మధ్య మధ్యలో రైతులకు వ్యవసాయానికి సంబందించి క్విప్ పోటీలను సైతం ఈ వాట్సాప్ ఛానల్ లో నిర్వహిస్తున్నారు. మరోవైపు వసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందేశాన్ని, ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్ల వివరాలు, వీడియో లింక్ లు ఇలా.. అన్ని ఈ వాట్సప్ చానల్ ద్వారా రైతులకు వ్యవసాయ శాఖ చేరవేస్తుంది. రైతులకు సమాచారం ఇవ్వడమే కాదు.. గ్రూప్ డిస్కషన్ కోసం జూమ్ సమావేశాలకు సంబందించిన లింక్ లను కూడా ఈ వాట్సప్ ఛానెల్ లో షేర్ చేస్తుంది. దీంతో నేరుగా రైతులు వారి సమస్యలను పంటల వివరాలు చెప్పడానికి వాట్సాప్ చానెల్ వేదికగా మారింది
వ్యవసాయ వివరాలు
రైతులకు ఉపయోగపడేందుకు వాట్సాప్ ఛానల్ తీసుకొచ్చాం. రైతుల బీమా కు సంబందించిన సమాచారం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ వివరాలు, పంటల సంరక్షణ, సీజనల్ సూచనలు, ఆయా పంటలకు కీటక నియంత్రణ మార్గదర్శకాలు. మార్కెట్ ధరలు మరియు శిక్షణా కార్యక్రమాల అప్ డేట్లు ఇలా అన్ని వివరాలు అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమాల షెడ్యూల్ వివరాలు అన్ని ఈ వాట్సాప్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం వ్యవసాయ శాఖ వాట్సాప్ చానల్ ను ఫాలో కావాలి.
Also Read: CM Revanth Reddy: కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్.. చెత్తగాళ్లంటూ ఫైర్!