Lavanya and Raj Tarun
ఎంటర్‌టైన్మెంట్

Raj Tarun and Lavanya: రాజ్‌ త‌రుణ్‌పై మ‌రో కేసు.. ఇప్పుడప్పుడే లావణ్య వదిలేలా లేదుగా!

Raj Tarun and Lavanya: రాజ్ తరుణ్, లావణ్యల వివాదం ఇప్పుడప్పుడే తెగేటట్టు లేదు. మరోసారి రాజ్ తరుణ్‌పై లావణ్య (Lavanya) పోలీసులను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఈసారి రాజ్ తరుణ్ కొంత మంది అనుచరులను పంపి తనపై దాడి చేయించాడంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును పరిశీలించిన నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసి విచారణకు సిద్ధమైనట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి, ఈ వివాదానికి ఏదో విధంగా ముగింపు ఇవ్వండి అంటూ నెటిజన్లు, అభిమానులు కూడా కోరుకుంటూ ఉండటం విశేషం. అంతా సద్దుమణిగింది అనుకునే టైమ్‌లో.. మళ్లీ మేము ఉన్నాం, మా మధ్య గొడవలు అలానే ఉన్నాయంటూ వీళ్లు తెరపైకి రావడం, ఒక సీరియల్‌ని తలపిస్తోంది. అందుకే అందరూ ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందా? అని ఎదురు చూస్తున్నారు.

Also Read- Little Hearts Hero: ఎప్పుడో, ఎవరినో, ఏదో అన్నానని బాయ్‌కాట్ అంటున్నారు.. అసలు మీరు మనుషులేనా?

ఫిర్యాదు ఎందుకంటే..

ఇప్పుడు ఫిర్యాదు విషయానికి వస్తే.. తను కోకాపేట ఇంటిలో ఉండగా, రాజ్ తరుణ్ (Raj Tarun) అనుచరులు ఇంటిలోకి చొరబడి, దూషించి, భౌతిక దాడులు జరిపారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, తన ఇంటిలోని పెంపుడు జంతువులను సైతం కాళ్లతో తన్ని చంపేశారని, తన మెడలోని ఆభరణాలను కూడా లాక్కెళ్లిపోయారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెల్లడించింది. ప్రసుత్తం ఉంటున్న విల్లాను ఇద్దరం కలిసి కొన్నామని, మా మధ్య భేధాలు కారణం ఆ విల్లానే అని, దానిపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందని లావణ్య పేర్కొంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో హీరో రాజ్ తరుణ్‌తో పాటు, మణికంఠ, రాజశేఖర్, అంకిత్ గౌడ్, రవితేజ, శశిలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

లావణ్య వెర్షన్ ఇదే..

ప్రస్తుతం ఇంటి గొడవగా ఇది కనిపిస్తున్నా, అసలు విషయం మాత్రం వేరే ఉందనేది అందరికీ తెలిసిందే. దీనికంతటికీ కారణం త్రికోణ ప్రేమ కథ అనే విషయం ఆ మధ్య బాగా చర్చలకు వచ్చింది. గత కొంతకాలంగా హీరో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వీ మల్హోత్రాల మధ్య వివాదం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రాజ్ తరుణ్‌తో తను 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నానని, రహస్యంగా గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని లావణ్య ఆరోపించింది. అయితే, తనను మోసం చేసి, ‘తిరగబడరా సామి’ సినిమా హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ సంబంధం పెట్టుకున్నాడని, ఆ కారణంగానే తనను దూరం పెట్టాడని లావణ్య గతంలో లావణ్య పోలీసులకు ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది.

Also Read- Bellamkonda Sai Sreenivas: ఫోన్ చూసుకునే టైమ్ కూడా ఇవ్వదు.. అంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది

ఖండించిన రాజ్ తరుణ్, మాల్వీ

ఈ ఆరోపణలను రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఇద్దరూ ఖండించారు. తాను లావణ్యతో కొంతకాలం రిలేషన్ షిప్‌లో ఉన్న మాట వాస్తవమే అని, కానీ 2017 లోనే విడిపోయామని రాజ్ తరుణ్ తెలిపారు. లావణ్య డ్రగ్స్‌కు బానిసై తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని, ఆమె ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని రాజ్ తరుణ్ చెబుతూ వస్తున్నారు. మరోవైపు, మాల్వీ మల్హోత్రా కూడా లావణ్య ఆరోపణలను ఖండించింది. రాజ్ తరుణ్ కేవలం తన సహనటుడు మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, లావణ్య తనకు, తన సోదరుడికి బెదిరింపు సందేశాలు పంపుతోందని ఆమె తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఈ వివాదం అంతులేకుండా సాగుతూనే ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం