Sammakka-Saralamma Jatara( image CREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ

Sammakka-Saralamma Jatara: తెలంగాణ ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీకగా సమ్మక్క సారక్క జాతర‌

Sammakka-Saralamma Jatara: తెలంగాణ ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక స‌మ్మ‌క్క సార‌క్క జారత అని మంత్రి కొండా సురేఖ‌(Minister Konda Surekha) పేర్కొన్నారు. సమ్మక్క సారక్క జాతర ఖ్యాతి ఖండాంత‌రాలు దాటేలా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. గ‌తం కంటే ఈ సారి ఘ‌నంగా జ‌ర‌పాల‌ని అధికారులను ఆదేశించారు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి స‌చివాల‌యంలో మేడారం మాస్టర్​ ప్లాన్​ పై స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనల మేరకు మేడారం దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్ ను మంత్రులు పరిశీలించారు. డిజైన్లలో మార్పులపై మంత్రులు సూచనలు చేశారు. పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేప‌ట్టాల‌ని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఈ మహా మేడారం జాతర

భక్తుల సందర్శనార్థం అమ్మవారి గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురాగా డిజైన్లు మార్చాలన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ భక్తుల సందర్శనార్థం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలు ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. సమ్మక్క సారలమ్మ సేవ కోసం జాతరలో భక్తులకు సహాయపడేందుకు వాలంటీర్లను నియమించాల‌న్నారు. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయ బద్ధంగా మేడారం పరిసరాలను తీర్చిదిద్దాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ మహా మేడారం జాతరకు ప్రజాప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింద‌ని గుర్తు చేశారు.

 Also Read: CM Revanth Reddy: లబ్ధిదారుల క్షేమ సమాచారం తెలుసుకున్న.. సీఎం రేవంత్ రెడ్డి

మేడారం మాస్టర్ ప్లాన్ డిజైన్

అవసరమైతే ఇతర శాఖల సహాయంతో మరిన్ని నిధులు కేటాయిస్తామ‌న్నారు. జాతర నిర్వహణ ఏర్పాట్లు, మేడారం మాస్టర్ ప్లాన్ డిజైన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి  ఆయ‌న అనుమ‌తి తీసుకున్న త‌ర్వాత ముందుకు వెళ‌తామ‌న్నారు. శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు జ‌రిగితే మేడారం జాత‌ర మ‌రింత అభివృద్ధి చెందుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మేడారం – ఊరట్టం, మేడారం – కన్నెపల్లితో పాటు మరో నాలుగు మార్గాల విస్తరణ పనులు చేపడుతున్న వివ‌రాలను అధికారులు తెలిపారు. ఈ స‌మావేశంలో ఎండోమెంటు ప్రిన్స్ ప‌ల్ సెక్ర‌ట‌రీ శైల‌జా రామాయ్య‌ర్, ములుగు కలెక్టర్ దివాకర్, ఎండో మెంట్ అడిషనల్ కమిషనర్లు కృష్ణవేణి, శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సమ్మక్క-సారక్క’కు రూ.236.2 కోట్ల మాస్టర్ ప్లాన్

దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతరగా మేడారం పేరొందింది. మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. శాశ్వతంగా పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం 236.2కోట్లతో మాస్టర్ ను రూపొందించింది. గ‌ద్దెల అభివృద్ధికి రూ. 58.2 కోట్లు, గ‌ద్దెల వ‌ద్ద క‌ళాకృతి ప‌నులకు రూ. 6.8 కోట్లు, జంప‌న్న వాగు అభివృద్ధి కోసం రూ. రూ39 కోట్లు, భక్తుల అకామిడేషన్​ నిమిత్తం రూ. 50 కోట్లు , రోడ్ల అభివృద్ధి నిమిత్తం రూ. 52.5 కోట్లు, మిగ‌తావి ఇత‌ర‌త్రా ఖ‌ర్చుల నిమిత్తం వెచ్చించ‌నున్నారు.

ప్రభుత్వం కేటాయించిన నిధులతో మేడారం సమీపంలోని మార్గాల్లో ట్రాఫిక్‌ జాం సమస్యను అధిగమించేందుకు రహదారులను విస్తరించనున్నారు. పస్రా-మేడారం, తాడ్వాయి-మేడారం, కొండాయి, భూపాలపల్లిని కలిపే కాల్వపల్లి, గొల్లబుద్దారం బయ్యక్కపేట రోడ్లను విస్తరణ. జాతరకు 20 కి.మీ దూరంలో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు. మేడారంలో అంతర్గత రోడ్లనూ వెడల్పు . భక్తులకు శాశ్వత ప్రాతిపదికన కాటేజీలు నిర్మాణం. గతంలో కేటాయించిన నిధులతో మేడారంలో పూజారుల విశ్రాంతి భవన సముదాయం, మేడారం-ఊరట్టం సీసీ రోడ్డు నిర్మాణ పనులు.

 Also Read: Sanitation Crisis: గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం.. పట్టించుకునే నాథుడే లేడా?

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?