GAMA Awards 2025: అల్లు అర్జున్ హీరోగా ” పుష్ప 2 ” ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గామా అవార్డ్స్ 2025 (Gulf Academy Movie Awards) దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఆగస్టు 30, 2025న ఘనంగా జరిగింది. ఈ 5వ ఎడిషన్ వేడుకలో ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.
Also Read: Bunny Vas: టాలీవుడ్‌లో చాలా రూల్స్ ఉన్నాయ్.. కానీ పాటించడమే అసాధ్యం! బన్నీ వాస్ షాకింగ్ కామెంట్స్
బెస్ట్ యాక్టర్ 2024: అల్లు అర్జున్ (‘పుష్ప 2: ది రూల్’) – అల్లు అర్జున్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
బెస్ట్ మూవీ: ‘పుష్ప 2’ (మైత్రి మూవీ మేకర్స్, యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మాణం).
బెస్ట్ డైరెక్టర్: సుకుమార్ (‘పుష్ప 2’) – ఈ సినిమాకి దర్శకత్వం వహించిన అతని ప్రతిభకి గుర్తింపు పొందింది.
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్ (‘పుష్ప 2’) – ఈ చిత్రానికి ఇచ్చిన సంగీతం ఓ ఊపు ఊపేసింది.
బెస్ట్ కొరియోగ్రఫీ: భాను మాస్టర్ (‘నల్లంచు తెల్లచీర’ పాట, ‘పుష్ప 2’).
మొత్తం ‘పుష్ప 2’ మూవీ టీమ్ 5 అవార్డులను గెలుచుకుంది. ఈ అవార్డు ఫంక్షన్ కు ప్రముఖ యాంకర్లు సుమ, హర్షలు తమ సందడి చేశారు. టాలీవుడ్ నుండి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. గామా అవార్డ్స్ జ్యూరీ చైర్‌పర్సన్‌లుగా ప్రముఖ దర్శకులు ఏ. కోదండ రామిరెడ్డి, సంగీత దర్శకుడు కోటి, దర్శకుడు బి. గోపాల్ వ్యవహరించారు. ఈ వేడుక వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో, కీన్‌ఫ్రా ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో జరిగింది. ‘పుష్ప 2’ మూవీ నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందడంతో ఈ అవార్డులు దాని విజయానికి మరింత గౌరవాన్ని తెచ్చి పెట్టాయి.