Bhatti Vikramarka (imagecredit:swetcha)
తెలంగాణ

Bhatti Vikramarka: గుడ్ న్యూస్.. త్వరలో హెల్త్ ఎంప్లాయిస్ స్కీమ్ గైడ్ లైన్స్

Bhatti Vikramarka: త్వరలో హెల్త్ ఎంప్లాయిస్ స్కీమ్ కు ప్రత్యేక గైడ్ లైన్స్ రానున్నాయి. ఈ మేరకు ఈ నెల 8న ఉద్యోగుల జేఏసీతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. ఇక ఇప్పటికే పెండింగ్ లో ఉన్న బిల్లులకు ప్రతి నెల ప్రభుత్వం రూ. 700 కోట్లను రిలీజ్ చేయనున్నది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), సీఎస్ రామకృష్ణారావు(CS Ramakrishna Rao) లు ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారినికి హామీ ఇచ్చినట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.

గ్రేడింగ్ చేసి క్యాడర్ స్టంట్

నాంపల్లి టీజీవో భవన్ లో జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు .విజిలెన్సు, ఏసీబి(ACB) కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు 2 సంవత్సరాలకు పైగా సస్పెన్షన్ లో ఉన్నవారికి క్రమంగా పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. గ్రామపంచాయతీలు గ్రేడింగ్ చేసి క్యాడర్ స్టంట్ నిర్ణయించి, ప్రమోషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు కూ హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం వేర్వేరు కాదని, సుపరిపాలన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ నేపధ్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఇచ్చిన దశల వారీగా ఆందోళనలను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్, సెక్రటరీ జనరల్ లు ప్రకటించారు.

Also Read: Gold Rate Increased: ఆల్ టైం రికార్డ్.. అతి భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన గోల్డ్?

205 సంఘాలతో కూడిన

ఇదిలా ఉండగా, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని 205 సంఘాలతో కూడిన జేఏసీ దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని గత నెలలో ప్రకటించింది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్ లో టీచర్లు, ఉద్యోగుల జేఏసీ ఆధ్యర్యంలో వేలాది మంది ఇందిరాపార్క్, ఆర్టీసీ కళా భవన్ లో భారీ కార్యక్రమాలు నిర్వహించింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా డిప్యూటీ సీఎం జేఏసీ ని చర్చలకు పిలిచి ఉన్నతాధికారుల సమక్షంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Also Read: Ram Charan: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భేటీ.. మ్యాటర్ ఏంటంటే?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్