Happy Birthday Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి తన ట్విట్టర్ లో ఓ హృదయపూర్వక సందేశాన్ని పంచుకుంటూ, పవన్ ఆరోగ్యంగా, సంతోషంగా, ఉండాలని కోరుకున్నారు. తమ్ముడు పవన్ మీద చిరు కి ఎంత ప్రేమ ఉందో మనమందరం ఎన్నో సందర్భాలలో చూశాము.
చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. (2004)లో పవన్ కళ్యాణ్ ఒక పాటలో కనిపించారు. అలాగే, ఖైదీ నంబర్ 150 (2017)లో పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లి అభిమానులను ఆకట్టుకున్నారు. పవన్ హీరోగా నటించిన కొత్త సినిమాలు విడుదలైనప్పుడు చిరంజీవి తన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి చిత్రాల రిలీజ్ సమయంలో చిరంజీవి పవన్ మీద ప్రశంసలు కురిపించారు.
చిరు తన ఎక్స్ లో ” చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను అంటూ ” హార్ట్ టచింగ్ మెసేజ్ ను రాసుకొచ్చారు.
” అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ” తో తన సినీ కెరీర్ ను మొదలు పెట్టిన పవన్ ఇప్పుడు రెండు పడవల మీద కాలేసి అటు రాజకీయ నాయకుడిగా, ఇటు హీరోగా దూసుకెళ్తున్నాడు. ఇటీవలే హరి హర వీర మల్లు చారిత్రక యాక్షన్ డ్రామా రిలీజ్ కాగా, ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు అందరూ ” ఓజీ ” సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. హరిష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే, 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి విజయంలో పవన్ కీలక పాత్ర పోషించగా, చిరంజీవి తన అభినందనలు తెలియజేశారు. పవన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినప్పుడు కూడా చిరంజీవి ఎంతగానో గర్వపడ్డారు.