Congress Government Changes Haritha Haram Name As Indhira Vana Prabha
సూపర్ ఎక్స్‌క్లూజివ్

HarithaHaram: హరితహారం కాదు, ఇందిర వనప్రభ..

Congress Government Changes Haritha Haram Name As Indhira Vana Prabha: ప్రతిఏటా తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని తీసుకొచ్చింది. అటవీ, పర్యావరణ శాఖలు చేపడుతున్న హరితహారం పేరును కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిర వనప్రభగా మార్చనున్నట్లు సమాచారం. ప్రతి వర్షాకాలం నుండే మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో మొదలుపెట్టారు. పదేళ్లు ఇది హరితహారంగానే కొనసాగింది. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హరితహారం పేరుని మార్చాలని భావించారు. ఈ క్రమంలోనే దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరును కలుపుతూ ఇందిర వనప్రభగా వచ్చేటట్టుగా ఈ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా 2004-14 మధ్యన ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.


అప్పట్లో దీనికి వన యజ్ఞం అని పేరు పెట్టారు. తాజా నిర్ణయంతో హరితహారం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ తదితర ఉన్నతాధికారుల హోదాకు ముందు ఇందిర వనప్రభ పేరును చేర్చనున్నారు. వర్షాకాలంలో ఈ కార్యక్రమం కింద మొక్కలు నాటి సంరక్షించడం, నర్సరీలను ఏర్పాటు చేయడం, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి తదితరాలను చేపట్టనున్నారు. రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్ధలాల్లో నీడనిచ్చే మొక్కలను పెంచనున్నారు. కోతులు, ఇతర పక్షుల కోసం ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇంటి ఆవరణలో పండ్లనిచ్చే మొక్కలు నాటడం, వాటిని పెంచడంపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడతారు. విద్యార్థులకు పచ్చదనం ప్రాధాన్యం వివరించనున్నారు. ఇవన్నీ ఇప్పటివరకు తెలంగాణకు హరితహారం పేరుతో జరిగాయి.

Also Read: సోనియా..ఆగయా


ఇకపై ఇందిర వనప్రభ కింద కొనసాగనున్నాయి. కలప, పండ్లనిచ్చే మొక్కలు, ప్లాంటేషన్‌ నమూనాలకు ఏర్పాటు చేసిన బోర్డులు మారనున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపునకు సేకరిస్తున్న హరిత నిధి, ఇకపై ఇందిర వనప్రభ నిధి కానుంది. ప్రజలు, ఉద్యోగుల ద్వారా విరాళాల రూపంలో వస్తున్న ఈ నిధులను జిల్లాకు ఒకటి చొప్పున సెంట్రల్‌ నర్సరీల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్‌ కోసం మొక్కల పెంపకం, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల్లో పనులు, దశాబ్ది సంపద వనాల పేరుతో సాగునీటి శాఖ పరిధిలో ఉన్న మిగులు భూమిలో వనాల పెంపకానికి ఖర్చు చేస్తున్నారు. ప్రతి రూపాయికి పక్కా లెక్క, జవాబుదారీతనంతో పనులు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. కేటాయింపులు, ఖర్చు వివరాలను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.

Just In

01

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది