Vishal Wedding: విశాల్ (Hero Vishal) మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. అందులోనూ పెళ్లి విషయంలో ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన ఇబ్బందులు ఫేస్ చేసినా, మళ్లీ అదే తప్పు చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ విశాల్ చేస్తున్న తప్పు ఏంటి? అని అనుకుంటున్నారా? తన పెళ్లిని, నడిగర్ సంఘం భవన నిర్మాణానికి లింక్ పెట్టడమే. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ఈ భవనం పేరు చెప్పి, ఇప్పటికే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు తన లైఫ్‌లోకి రావాల్సి, చివరి నిమిషంలో సైడ్ అయ్యారు. ఇప్పుడు శుభమా అని సాయి ధన్సిక (Sai Dhansika)తో నిశ్చితార్థం అయిన తర్వాత కూడా, తన పెళ్లిని అదే నడిగర్ సంఘం భవన నిర్మాణానికి లింక్ పెట్టడంతో, కోలీవుడ్ మీడియా అంతా ఇలా రాతలు రాస్తోంది.
బర్త్‌డే రోజే నిశ్చితార్థం
విశాల్ నిశ్చితార్థం ఆయన బర్త్‌డే రోజే జరగడం విశేషం. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని విశాల్ అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుంది. కానీ విశాల్ పుట్టినరోజు (ఆగస్ట్ 29)నే వారి నిశ్చితార్థం జరగడం అంటే అది యాదృశ్చికంగా జరిగిందో, లేదంటే కావాలని ప్లాన్ చేశారో మాత్రం తెలియదు. కానీ, ఇది వారికి ఒక విశేషంగా మాత్రం నిలిచిపోతుంది.
Also Read- Allu Kanakaratnamma: ముగిసిన అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు.. పాడె మోసిన చిరు, మనవళ్లు!
పెళ్లి అప్పుడే!
ఇక నిశ్చితార్థం అయితే అయింది కానీ, పెళ్లి మాత్రం ఇప్పుడప్పుడే కాదని విశాల్ చెప్పడంతోనే పై విధంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తన పెళ్లి ఎప్పుడో చెబుతూ.. ఈ పుట్టినరోజు బ్యాచ్‌లర్‌గా నేను చేసుకునే చివరిది. నడిగర్ సంఘం భవనం (Nadigar Sangam building) నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని గతంలో చెప్పాను. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను. ధన్సికకు కూడా ఈ విషయం చెప్పాను. ఆమె కూడా అంగీకరించింది. దాదాపు 9 ఏళ్లుగా నడిగర్ సంఘం భవనం నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇంకో 2 నెలల్లో పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. అందులో జరిగే మొట్టమొదటి పెళ్లి మాదే. నడిగర్ సంఘం భవనంలో ఉండే ఆడిటోరియాన్ని మా పెళ్లి కోసం బుక్ చేయడం కూడా జరిగింది. భవనం ప్రారంభోత్సవం పూర్తవగానే పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటిస్తామని విశాల్ చెప్పుకొచ్చారు.
Also Read- Sugali Preethi Case: పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్!
ఆగస్ట్ 29నే పెళ్లి జరగాలి
వాస్తవానికి మా పెళ్లి ఆగస్ట్ 29న జరగాలి. కానీ భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అసలు పెళ్లిని ఇన్ని రోజులుగా వాయిదా వేసుకోవడానికి కూడా కారణం ఇదే. ఇంకా రెండు నెలలు సమయంలో భవనం పూర్తవుతుంది. అప్పుడే పెళ్లి పెట్టుకుంటామని అన్నారు.
నెక్ట్స్ చిత్రమిదే..
ప్రస్తుతం విశాల్ చేతిలో ఉన్న చిత్ర టైటిల్ ‘మకుటం’ అని ఇటీవలే అనౌన్స్ చేశారు. ఇది విశాల్‌కు 35వ సినిమా. అలాగే సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మిస్తున్న 99వ సినిమా కూడా కావడం విశేషం. ఆర్‌బి చౌదరి ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇందులో మూడు వైవిధ్యమైన పాత్రలలో విశాల్ కనిపించనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు