ntr-political(Inage :X)
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR political entry: రాజకీయాల్లోకి తారక్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన రామారావు కుమార్తె.. ఫ్యాన్స్‌కు పండగే!

Jr NTR political entry: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అక్క సుహాసిని మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. అవకాశం వచ్చినపుడు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు. అని అన్నారు. ఇప్పటికే ఓ రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. ఫ్యాన్స్ ఈ విషయంపై ఆ రాజకీయ నాయకుడి మీద నిరసన చేపట్టారు. ఈ విషయం సీఎం చంద్రబాబు వరకూ వెళ్లడంతో రాజకీయనాయకుడు తగ్గాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఎన్టీఆర్ సోదరి చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడంపై అభిమానులు తెగ సంబర పడుతున్నారు. ఎన్టీఆర్ కు సీఎం కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయంటూ కితాబిస్తున్నారు.

Read akso-Viral Video: వామ్మో.. పాముతో నాగిని డాన్స్ ఏంట్రా బాబు?

తెలుగు సినిమా పరిశ్రమలో ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) సినిమాల్లో తన నటన, నృత్యం, సంభాషణలతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి మొదటిసారిగా 2009లో గట్టిగా చర్చ జరిగింది. అప్పటి ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. 26 ఏళ్ల వయసులో ఆయన చేసిన ప్రసంగాలు, అభిమానులను ఆకర్షించే విధానం రాజకీయంగా ఆయనకు ఉన్న సామర్థ్యాన్ని చాటాయి. టీడీపీ స్థాపకుడి మనవడిగా, ఆయన ప్రచారం పార్టీకి ఊపిరి పోసింది. అయితే, ఆ ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉండటానికి నిర్ణయించుకున్నారు. రాజకీయాలు తన సినిమా కెరీర్‌పై ప్రభావం చూపుతాయని భావించి, సినిమాలపైనే దృష్టి సారించారు.

Read akso-Samantha: ఒక రోజు నాగ చైతన్యతో అలాంటి పని చేశా.. సమంత సంచలన కామెంట్స్

ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌తో సంబంధించిన ఓ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు మళ్లీ రాజకీయ చర్చల్లోకి వచ్చింది. ఈ ఆడియోలో ఎమ్మెల్యే ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అభిమానులు ఆరోపించారు. దీంతో టీడీపీలో వివాదం రేగింది. ఈ సంఘటన ఆయన రాజకీయాల్లోకి రాకపోయినా, ఆయన పేరును రాజకీయంగా ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. మొత్తంగా, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ప్రస్తుతానికి తక్కువగానే కనిపిస్తోంది. ఆయన అభిమానులు, రాజకీయ వర్గాలు ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు చేస్తున్నప్పటికీ, ఆయన సినిమాలపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆయన నిర్ణయం ఏమైనా, నందమూరి వారసత్వం కారణంగా ఆయన పేరు రాజకీయ చర్చల్లో నిలిచే అవకాశం ఉంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!