Bigg Boss Telugu 9
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంఛింగ్ డేట్ ఖరారు.. చద‌రంగం కాదు, ర‌ణ‌రంగ‌మే!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమయ్యేది ఎప్పుడో తెలిసిపోయింది. కొన్ని రోజులుగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ సందడి చేస్తున్న ఈ షో‌పై ఇప్పటికే ప్రేక్షకులు ఓ అంచనాకి వచ్చేశారు. అందులోనూ ఈసారి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. నార్మల్ సెలబ్రిటీలు కాకుండా దాదాపు 5 నుంచి 15 మంది వరకు కామనర్స్ ఉండబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. అంతేకాదు, ఈసారి బిగ్‌ బాస్ షోకి సంబంధించి రెండు హౌస్‌లు సెట్ చేసినట్లుగా కింగ్ నాగార్జున కూడా అధికారికంగా ప్రకటించారు. ఒకటి సెలబ్రిటీల కోసమైతే, మరొకటి కామనర్స్ కోసం అనేలా నాగ్ సెలవిచ్చారు. మరి సెలబ్రిటీలు, కామనర్స్ కలిసి ఆడతారా? లేదంటే విడివిడిగా ఆడతారా? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంచారు. మొత్తంగా అయితే కామనర్స్ కోసం పెట్టిన అగ్ని పరీక్ష కూడా చాలా హాట్ టాపిక్ అయింది. అందులో నుంచి వెనక్కి వచ్చిన వారు జడ్జిలపై చేసిన కామెంట్స్, అగ్ని పరీక్షలో పెట్టిన టాస్క్‌లు అన్నీ కూడా ఈసారి షో రణరంగాన్ని తలపిస్తుందనిపించాయి. అదే విషయాన్ని నాగార్జున (King Nagarjuna) కూడా చెప్పడం విశేషం.

Also Read- Nagarjuna: ఇంకా సైమన్ లుక్‌లోనే నాగార్జున.. బర్త్ డే స్పెషల్‌గా ఫ్యాన్స్‌ని మీటైన కింగ్!

లాంచింగ్ ఎప్పుడంటే..
కామనర్స్ సెలక్షన్స్‌తోనే సరిపెడతారా? షో ఎప్పుడు మొదలు పెడతారు? అని చాలా మంది కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం ఎప్పుడో తెలుపుతూ వచ్చిన స్పెషల్ ప్రోమోలో.. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం అవుతుందని స్టార్ మా అధికారికంగా తెలియజేసింది. దీంతో, అసలు ఈసారి హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరా? అని సెర్చింగ్ చేయడం మొదలు పెట్టారు. ఈ సెర్చింగ్‌లో ఒకరిద్దరు హీరోయిన్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఆశాశైనీ, సంజ‌న గ‌ల్రానీ వంటి హీరోయిన్లతో పాటు ఇటీవల జానీ మాస్టర్ విషయంలో హైలైట్ అయిన శ్రేష్టి వర్మ కూడా లిస్ట్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అగ్ని పరీక్షతో కామనర్స్ కూడా బాగానే నోటెడ్ అయ్యారు కాబట్టి.. ఈసారి షో మరింత ఆసక్తికరంగా ఉంటుందనే భావించవచ్చు.

Also Read- OG Premieres: అక్కడ అంచనాలు మించిపోతున్న ‘ఓజీ’.. ఈ తుఫాన్ ధాటికి రికార్డుల గల్లంతు

బిగ్‌ బాస్‌ వాయిస్ ఛేంజ్
ఈసారి షోకి మరో స్పెషల్ కూడా ఉంటుందని కింగ్ నాగార్జున ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిన 8 సీజన్లకు బిగ్ బాస్ వాయిస్ ఒకటే ఉంది. కానీ ఈసారి బిగ్‌బాస్‌ని కూడా మార్చేస్తున్నట్లుగా కింగ్ తెలిపారు. ఆ వాయిస్ రొటీన్ అయిపోయిందని భావించారో, లేదంటే మరో పవర్ ఫుల్ వాయిస్ వారికి లభించిందో తెలియదు కానీ, ఇప్పటి వరకు నోటెడ్ అయిన వాయిస్‌ని మార్చడం అంటే.. బిగ్ బాస్ మేకర్స్ ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నారనేది మాత్రం తెలుస్తోంది. ఇక ఈసారి సీజన్‌కు కూడా హోస్ట్‌గా కింగ్ నాగార్జునే వ్యవహరించనున్నారు. సీజన్ 3 నుంచి వరసగా కింగ్ నాగార్జునే ఈ షోని హోస్ట్ చేస్తూ వస్తున్నారు. మధ్యలో బాలయ్య, రానా, విజయ్ దేవరకొండ పేర్లు వినిపించినా.. అవన్నీ రూమర్స్ మాత్రమే అని బిగ్ బాస్ యాజమాన్యం ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 7 నుంచి కింగ్ ఆడించే ఆటకు అంతా సిద్ధమైపోండి…

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ