Uttam kumar reddy: నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Min Uttam Kumra Redy) ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిళ్లకుండా ఉండేందుకు గురువారం నీటిపారుదల శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపద్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నష్టనివారణ చర్యలు సత్వరమే చేపట్టాలని ఆదేశించారు. 24 గంటలు జలాశయాలలో నీటి మట్టాలను పర్యవేక్షించాలని, ప్రాణనష్టం,ఆస్తినష్టం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జలాశయలతో పాటు కాలువలు,చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. జీ.ఓ 45 ననుసరించి అత్యవసర నిధులతో నష్టనివారణ చర్యలు చేపట్టాలని, నీటిపారుదల శాఖాధికారులు రౌండ్ ది క్లాక్ క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు.
జిల్లాల కలెక్టర్లతో
ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ లకు సమాచారం అందించాలని, ఇసుక బస్తాలు ఇతరత్రా అత్యవసర సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. జలాశయాలతో పాటు పంప్ హౌజ్ ల నిర్వహణలో ఇంజినీరింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నీటి నిలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వరదల నుండి కాపాడుకోవడం తో పాటు నీటివనరుల పరిరక్షణ ప్రభుత్వానికి ప్రాధాన్యాతాంశంగా పరిగణించాలన్నారు. నీటిపారుదల శాఖాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు రెవెన్యూ, విద్యుత్ శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
Also Read: Collector Harichandana: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్ హరిచందన దాసరి
అవసరమైతే అదనపు పంపింగ్
కృష్ణా,గోదావరి బేసిన్ లలో నీటి నిల్వల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పూర్తి స్థాయిలో నీటి మట్టాలు చేరే సమాచారాన్ని ఇంజినీరింగ్ అధికారులు గుర్తించాలన్నారు. ప్రధాన జలాశయాలలో పంపులు పూర్తి స్థాయి సామర్ధ్యంతో పనిచేస్తున్నాయో లేదో అన్న విషయాన్ని సమీక్షించుకుని అవసరమైతే అదనపు పంపింగ్ తో నీటి మట్టాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ లో అవసరం ఉన్నంత మేరకు నీటిని నింపాలన్నారు. ఎడమ కాలువ నుండి విడుదల అవుతున్న నీరు వృధాగా సముద్రం పాలు కాకుండా చూడాలని చెప్పారు. గోదావరి బేసిన్ లోని శ్రీపాద ఎల్లంపల్లి,మిడ్ మానేరు,లోయర్ మానేరు ప్రాజెక్టుల పనితీరుపై సమీక్షించారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్,మల్లన్న సాగర్ లలో పంపింగ్ ను వేగవంతం చేసి పూర్తి స్థాయిలో నీటి మట్టాలు నిండేలా చూడాలన్నారు. అదే సమయంలో పంపింగ్ నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకునేందుకు విద్యుత్ శాఖాధికారులను సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు జలమయమైన రోడ్లు.. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయవద్దు