viral-post(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Trolls on South Film Industry: సౌత్ హీరోలపై సోషల్ మీడియా పోస్ట్ వైరల్.. వారికి అంత గర్వం పనికిరాదు!

Trolls on South Film Industry: సౌత్ హీరోలపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో నలుపు, తెలుపు రంగుల్లో రెండు ముసళ్లు ఒక దానిపై ఒకటి ఉంటాయి. దానికి సౌత్ ఇండియా మూవీలో హీరో హీరోయిన్ అంటూ క్యాప్షన్ పెట్టారు. అంటే దానికి అర్థం సౌత్ ఇండియాలో హీరోలు నలుపు రంగులో ఉంటారు, నార్త్ హీరోయిన్ లు తెల్లగా ఉంటారు అని దాని అభిప్రాయమా అంటూ సౌత్ హీరోల అభిమానులు మండి పడుతున్నారు. దీనిని చూసిన సౌత్ సినిమా ప్రేక్షకులు నార్త్ వాళ్లకు అంత పొగరు పనికి రాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిని ఇప్పటికే ఏడు లక్షలకు పైగా వీక్షించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

Read also-Team India: సహనం కోల్పోయాడు.. టీమిండియా స్టార్ పేసర్‌పై పంజాబ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

దీనిని చూసిన కొందరు సినిమా అభిమానులు నార్త్, సౌత్ అంటూ ఏమీలేదు అందరూ ఒక్కటే ఇప్పుడు అందరూ కలిసి పనిచేస్తున్నారు, అని అంటున్నారు. నార్త్ అభిమానులు అయితే ఇది నిజమే కదా అంటే, సౌత్ అభిమానులు మాత్రం ఇలా అనడం సరైన పద్దతి కాదు అంటున్నారు. ఇలాంటి పోస్టులు పెట్టేది ఏమీ తెలియని నిబ్బీ బ్యాచ్ అంటూ ఒకరు కామెంటు పెడితే, అందుకే సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి అంటూ జవాబు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పోస్టులు పెట్టడంపై సినిమాను అభిమానించే వారుకి నచ్చడంలేదు. నార్త్ ఇండియన్ కొందరు మాత్రం ఈ పోస్టులో తప్పేం ఉంది జరిగేది అదే కదా అంటూ రిప్లే ఇస్తున్నారు.

Read also-Viral Video: 25 ఏళ్ల యువతిని వేధించిన ఏడేళ్ల బాలుడు.. విలపిస్తూ వీడియో పెట్టిన బాధితురాలు!

అయితే ఈ పోస్టు హద్దులు దాటుతుందని గమనించిన ఈ పోస్ట్ పెట్టిన సదరు యూజర్ ఇలా రాసుకొచ్చారు.. ‘అందరూ దీన్ని ఉత్తర-దక్షిణ విషయంగా చేస్తున్నారు. కానీ మనందరం ఒక్కటే. ఇందులో నేను ఏమి చెప్పదలచుకున్నా అంటే.. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అందం మాత్రమే చూస్తున్నారు. ఆమె అందంగా, తెల్లగా ఉంటే సరిపోతుంది. అభినయం ఏం అవసరం లేదు. దీనివల్ల ఎంతో టాలెంట్ ఉన్న హీరోయిన్ లు అవకాశాలు కోల్పోతున్నారు. కేవలం తెల్లగా ఉన్న నటీమణులను మాత్రమే సౌత్ ప్రేక్షకులపై రుద్దడం సబబు కాదు. కొంచెం తెల్లగా లేకపోయినా టాలెంట్ ఉన్న అమ్మాయిలను ప్రోత్సహించాలి అదే నా ఉద్దేశం’ అంటూ రాసుకొచ్చారు. దీనిని చూసిన కొందరు ఇది సరైనదే కదా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!